ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్

గ్రూప్ 1 మెయిన్స్‌కు సన్నద్దం అవుతున్న అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

మే 3, 2025 నుండి మే 9, 2025 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.ప్రతి రోజు ఉదయం 10:00 AM నుండి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష సమయంగా నిర్ణయించారు.

AP Group 1 Mains Schedule Released

పరీక్షల వివరాలు:
మే 3, 2025: తెలుగు (అర్హత పరీక్ష)
మే 4, 2025: ఇంగ్లీష్ (అర్హత పరీక్ష)
మే 5, 2025: పేపర్-I: జనరల్ ఎస్సే
మే 6, 2025: పేపర్-II: భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి మరియు భూగోళశాస్త్రం
మే 7, 2025: పేపర్-III: పాలిటీ, రాజ్యాంగం, పరిపాలన, చట్టం మరియు నీతి
మే 8, 2025: పేపర్-IV: భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
మే 9, 2025: పేపర్-V: సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు

ఈ మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతాయి. ప్రశ్నపత్రాలను ట్యాబ్లెట్‌లలో చూపిస్తారు, అయితే అభ్యర్థులు పెన్నుతో కాగితంపై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అర్హత పరీక్షలైన తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ను సందర్శించగలరు. హాల్ టిక్కెట్లు పరీక్ష తేదీకి వారం ముందు విడుదలయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+