Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Heat Wave: ఏపీలో ఈసారి తీవ్ర ఎండలు-ఈ జిల్లాల్లో వడగాల్పులు-లేటెస్ట్ రిపోర్ట్..!

ఏపీలో ఈసారి భానుడి భగభగలు (Heat Wave) తప్పవని తేలిపోయింది. అదీ ఈనెల నుంచే ఎండలు మండిపోతాయని అధికారులు ఇవాళ వెల్లడించారు. ఈ నెల నుంచి ప్రారంభమయ్యే భారీ ఉష్ణోగ్రతలు, ఏప్రిల్, మే కల్లా మరింత పెరుగుతాయని అంచనా వేశారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) తాజా రిపోర్ట్ విడుదల చేసింది. వేడి వాతావరణం దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రతలను కూడా వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లను కూడా ప్రకటించింది.

ఈ ఏడాది కూడా మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్దితి మరింత తీవ్రంగా ఉంటుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొందని విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచే అవకాశం ఉందన్నారు.

AP Heatwave Warning Above-Normal Temperatures Forecast from march SDMA release toll-free numbers

మార్చి నుంచి మే నెల వరకు శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కాబట్టి విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండతీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు.

ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని కోరారు. ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక సందేశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడనున్నందున చెట్ల క్రింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండతీవ్రతకు గురికాకుండా ఉండేందుకు ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు.

AP Heatwave Warning Above-Normal Temperatures Forecast from march SDMA release toll-free numbers

మేడపైన మొక్కలు, ఇంట్లో ని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయని, అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయని తెలిపారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలన్నారు. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచితే తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలన్నారు. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగు వెంట తీసుకెళ్లాలన్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం , టోపి పెట్టుకోవడం, కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+