Black Fungus In AP: తక్కువగా ఔషధాల సరఫరా...కేంద్రంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రమేష్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసును విచారించింది. ప్రధానంగా బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స, కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రశ్నించింది.

అంతేగాక, ఏపీలో బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఆంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్లను సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, దీనిపై కేంద్రప్రభుత్వం ఓ అఫిడవిట్‌ను హైకోర్టుకు అందజేసింది.

 AP High Court expresses concern over short supply of black fungus drugs

బ్లాక్ ఫంగస్ రోగులకు అందించాల్సిన ఆంపోటెరిసన్ బీ ఇంజక్షన్ల సరఫరా చాలా తక్కువగా ఉందని హైకోర్టు పేర్కొంది. దీంతో ఇంజక్షన్ల తయారీకి అవసరమైన ముడిసరుకు లభ్యత తక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. విదేశాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుని ఇంజక్షన్లు తయారు చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు.

ఈ క్రమంలో రోగులకు అవసరమైన మేర మందులు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా విషయలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ఆక్సిజ్ కొరత లేకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారానికి విచారణను వాయిదా వేసింది.కాగా, కొద్ది రోజులు ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలసిందే. కొద్ది రోజులుగా 12వేల లోపే కరోనా కేసులు, వందలోనే మరణాలు నమోదవుతున్నాయి, ఏపీలో 45ఏళ్లకుపైబడినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+