ఏది రహస్యం- ఎలా నిర్ణయిస్తారు ? జగన్ సర్కార్ కు హైకోర్టు ప్రశ్నలు-రహస్య జీవోలపై
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందల సంఖ్యలో రహస్య జీవోలు విడుదలయ్యాయి. వీటిపై పలు అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. అనంతరం ప్రభుత్వ జీవోలు విడుదల చేయరాదని నిర్ణయించిన ప్రభుత్వం.. విమర్శలతో కొత్తగా మరో వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపైనా అభ్యంతరాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వెబ్ సైట్ లోనూ జీవోలు పూర్తిగా పెట్టకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది.

జగన్ సర్కార్ సీక్రెట్ జీవోలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా సీక్రెట్ జీవోలు జారీ చేస్తూనే ఉంది. ఇందులో ఏవి నిజంగా రహస్యంగా ఉంచాల్సిన ఉత్తర్వులో, ఏవి రహస్యం కాకపోయినా రహస్యంగా ఉంచుతున్నారో ఎవరికీ తెలియదు. అయినా ప్రభుత్వం మాత్రం రహస్య జీవోల పేరుతో వాటిని బహిర్గతం చేయడం లేదు. కొన్ని జీవోలైతే అసలు వెబ్ సైట్లోనే పెట్టడం లేదు. దీనిపైనా పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై హైకోర్టులోనూ ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఇది ఇవాళ విచారణకు వచ్చింది.

సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకం
ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు ఈ గెజిట్ లో ఉంచడం లేదని పిటిషనర్లు ఇవాళ వాదించారు. ప్రభుత్వ జీవోల్లో కేవలం 4 నుంచి 5 శాతం జీవోలు మాత్రమే వెబ్ సైట్లో పెడుతున్నారని, మిగతావి రహస్యం పేరుతో విడుదల చేయడం లేదని పిటిషనర్ ఆరోపించారు. ఇది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని పిటిషనర్ వాదించారు. దీనిపై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది అతి రహస్యమైన జీవోలు మాత్రమే వెబ్ సైట్లో ఉంచడం లేదని బదులిచ్చారు. దీంతో హైకోర్టు మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది.
Recommended Video

ఏది సీక్రెటో చెప్పాలన్న హైకోర్టు
ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల్లో కొన్నింటిని మాత్రమే వెబ్ సైట్లో పెట్టి మరికొన్నింటిని పెట్టకుండా దాచేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అసలు ఏది రహస్యమనే విషయంపై ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. ముఖ్యంగా ఏది రహస్యం, ఏది అతి రహస్యమన్నది ఎలా నిర్ధారిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు గతంలో హైకోర్టుకు హామీ ఇచ్చి ఇప్పుడు వెబ్ సైట్లో అన్ని జీవోలు ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సాఫీగా సాగే ప్రక్రియకు ఆటంకాలు కల్పిస్తారా అని సర్కార్ ను నిలదీసింది. ప్రభుత్వం తయారు చేసిన అన్ని జీవోల వివరాలు తమకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications