డీజీపీ సవాంగ్ నిజాయితీపరుడు, సమర్ధుడు- సిబ్బంది తప్పులతోనే రప్పించాం- హైకోర్టు
ఏపీలో కింది స్ధాయి సిబ్బంది చేసిన ఓ తప్పిదం కారణంగా హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్‌ను న్యాయస్ధానంలో హాజరుకావాలని పిలిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను కోర్టుకు రప్పించడానికి దారి తీసిన పరిస్ధితులపై హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఎస్సై రామారావు పదోన్నతి విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇవాళ హైకోర్టులో హాజరు అయ్యారు. ఎస్ఐ రామారావు తనకు పదోన్నతి లో అన్యాయం జరిగిందని తనకు సిఐగా పదోన్నతి ఇవ్వకుండా తన జూనియర్లకు పదోన్నతి కల్పించారని గతంలో హై కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హై కోర్టు ఎస్ఐ రామారావుకు పదోన్నతి కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది.

అయితే కోర్టు ఆదేశాలను పోలీస్ శాఖ అధికారులు అమలు చేయలేదు. దీనితో కోర్టు ధిక్కార నేరం కింద ఎస్ఐ రామారావు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై డిజిపి గౌతం సవాంగ్ స్వయంగా కోర్టుకు వచ్చి సమాధనం ఇవ్వాలని ఆదేశించింది. హై కోర్టు ఆదేశాలమేరకు గౌతం సవాంగ్ హై కోర్టుకు హాజరు అయ్యారు.
రామారావుకు సిఐగా ఇటీవల పదోన్నతి ఇచ్చామని హైకోర్టుకు డీజీపీ సవాంగ్ తెలిపారు. అయితే పదోన్నతి ఎందుకు ఆలస్యమైందని హైకోర్టు ఆయన్ను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని అడిగింది. తమ డిపార్మెంట్ అప్పీల్‌కు వెళ్లినందునే ఆలస్యం అయ్యిందని హైకోర్టుకు గౌతం సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా గౌతం సవాంగ్ నిజాయితీపడు, సమర్థుడైన అధికారే అని, క్రింది స్థాయి అధికారుల పొరపాట్ల వల్ల ఉన్నతాధికారులు కోర్టులకు రావలసి వస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు సక్రమంగా పనిచేసేట్లు చేసుకోమని డీజీపీకి సూచించింది. తదుపరి విచారణకు ఆయన హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications