మమ్మల్నీ వదల్లేదుగా..సోషల్ అరెస్టుల్లో తప్పేముందన్న హైకోర్టు..!

ఏపీలో సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వరుసగా జరుగుతున్న వైసీపీ కార్యకర్తల అరెస్టులను సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ పోస్టుల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తమను కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు వెలిసిన విషయాన్ని పిటిషనర్ కు గుర్తుచేసింది. అనంతరం త్వరలో దీనిపై ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది.

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారి పై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ మాజీ సమాచార కమిషనర్ విజయబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. అసభ్యకర పోస్టుల పెట్టినవారి పై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం గుర్తు చేసింది.

ap high court says no to intervene social media workers arrests key remarks on culprits

సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంలో పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి గంపగుత్త ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పేసింది.పోలీసులు కట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి పై పోలీసులు చట్ట నిబంధనలకు అనుగుణంగా పోస్టులు పెడుతుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ పిల్ పై తగిన ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+