Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ పిటిషన్... కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం(ఏప్రిల్ 15) న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరామని విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది.

హైకోర్టులో పిటిషన్ కన్నా ముందు రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఆధునిక యంత్ర పరికరాలతో,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నడుస్తోందని గుర్తుచేశారు. పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.43,700 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించారు.

 ap highcourt issues notices to file counter over vizag steel plant privatisation issue

విశాఖ స్టీల్ ప్లాంట్‌ (వీఎస్‌పీ)ని ఎన్‌ఎండీసీలో విలీనం చేయాలని... ఆపై వీఎస్‌పీ-ఎన్ఎండీసీని సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా మెగా స్టీల్ దిగ్గజంగా మారుతుందని చెప్పారు. మెగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ముడి వస్తువుల ఖర్చు,ఉత్పత్తి వ్యయం తగ్గుతుందన్నారు. రాష్ట్రపతి పేరిట ఉన్న స్టీల్ ప్లాంట్ భూమిలో 16,782 ఎకరాలను ప్లాంట్‌కు బదలాయించడం మరో ప్రత్యామ్నాయమని సూచించారు. దీనివల్ల తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకొస్తాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ మనుగడ సాధించాలంటే తక్షణం రూ.5వేల కోట్లు అవసరమని... దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్లాంట్ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆ మొత్తం సమకూరుతుందని సూచించారు.

గుజరాత్‌లో పటేల్ విగ్రహానికి వినియోగించిన 3200 టన్నును విశాఖ స్టీల్ ప్లాంట్‌లోనే తయారుచేశారని లేఖలో లక్ష్మీనారాయణ కేంద్రానికి గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు 18 వేల టన్నుల స్టీల్‌ను,నాగ్‌పూర్-ముంబై జాతీయ రహదారి కోసం 8500 టన్నుల స్టీల్‌ను విశాఖ స్టీల్ ప్లాంటే ఉత్పత్తి చేసిందని గుర్తుచేశారు.

Recommended Video

    INC TV - Congress YT Channel Launch మీడియా, జర్నలిస్టుల తీరును ఎత్తి చూపుతూ... గోదీ మీడియా అంటూ !!

    కాగా,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ,జనసేన మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కార్మికుల ఆందోళనకు మద్దతుగా నిలిచాయి. ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మికులు,రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నప్పటికీ... కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ ఆగదని ఇప్పటికే స్పష్టం చేసింది. కార్మికులు మాత్రం ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గేదాకా తమ పోరాటం ఆగదని చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+