హోంమంత్రి తానేటి వనితపై దాడికి టీడీపీ యత్నం-ఆస్తుల ధ్వంసం-నల్లజర్లలో ఘటన
ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ కు మరో ఐదు రోజులే మిగిలున్న నేపథ్యంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్న హోంమంత్రి తానేటి వనితపైనే దాడికి టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. నిన్న అర్ధరాత్రి గోపాలపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నల్లజెర్లలో ప్రచారం ముగించుకుని స్దానికంగా ఉన్న మాజీ జడ్పీటీసీ ఇంటికి వెళ్లిన వనితపై దాడికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకున్నాయి.
TDP Attack on Home Minister Taneti Vanitha and YCP cadre. pic.twitter.com/GKRTFkZjDC
— Actual India (@ActualIndia) May 8, 2024
నల్లజర్లలో ప్రచారం తర్వాత స్థానిక నేత ఇంటికి తానేటి వనిత వెళ్తున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు అక్కడికి భారీ ఎత్తున చేరుకుని దాడులకు దిగాయి. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్యుద్ధం, దాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వనితపై కూడా దాడికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే సెక్యూరిటీ సకాలంలో అడ్డుకుని ఆమెకు సురక్షితంగా మరో గదిలోకి తీసుకెళ్లారు.

టీడీపీ శ్రేణుల దాడిలో పలు వాహనాలతో పాటు ఫర్నిచర్ కూడా ధ్వంసం అయ్యాయి. ఐదుగురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడి తర్వాత పోలీసులు భారీ ఎత్తున చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. టీడీపీ శ్రేణుల దాడిపై హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతోందన్నారు. మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించడం దారుణమని వనిత తెలిపారు. హోంమంత్రిపైనే దాడి చేశారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలకి మనం ఏం చేశాం ఏం చేయబోతున్నాం అని వివరించి ఓట్లు అడగటం సాంప్రదాయం. కానీ ఇలాగ ఒక హోం మంత్రిపైనే ఇంతటి దాడికి దిగడం అనేది సభ్య సమాజంలో చాలా దారుణమైనటువంటి సన్నివేశం. ప్రజలారా ఆలోచించండి ఇలాంటి వ్యక్తులకి మన ఓటు వేస్తే ఇంత అరాచక ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు… pic.twitter.com/fWtZw699ZD
— Taneti Vanitha (@tanetivanita) May 8, 2024












Click it and Unblock the Notifications