అనకొండను వదిలించుకున్న హోంమంత్రి అనిత.. ! పదేళ్లుగా టార్చర్..
ఏపీలో తొలిసారి మంత్రి, హోంమంత్రి కూడా అయిన వంగలపూడి అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల కూటమి పాలనలో తన పనితీరు కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన తన పీఏ సంధు జగదీష్ ను ఎట్టకేలకు వదిలించుకున్నారు. పదేళ్లుగా తన వద్దే ఉంటున్న జగదీష్ చేసిన అక్రమాలన్నీ తెలిసీ కొంతకాలంగా భరిస్తూ వచ్చిన అనిత.. తాజాగా ఆయనకు చెక్ పెట్టేశారు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అనకాపల్లి జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పదేళ్ల క్రితం సంధు జగదీష్ అనే వ్యక్తిని పీఏగా నియమించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఓడినా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉండగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యాక కూడా అతనిని పీఏగా కొనసాగించారు. ఇదే అదనుగా సంధు జగదీష్ అనే వ్యక్తి అవినీతి ఆనకొండగా మారిపోయాడు. వసూళ్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు ఇలా జగదీష్ చేయని పని లేదు. చివరికి టీడీపీలో ఇతని వ్యవహారం నచ్చక మీటింగ్ పెట్టుకున్న అనిత అనుచరుల్ని కూడా బెదించాడు. దీంతో అతని పాపం పండింది.

కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా జగదీష్ దందాలు సాగాయి. పాయకరావుపేటలో పేకాట శిబిరాల నిర్వహణ, మద్యంలో షాపుల్లో వచ్చే ఆదాయంలో వాటా కోసం ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, హోంమంత్రి కోటాలో వచ్చిన తిరుమల దర్శనం టికెట్లు తిరుపతిలో ఓ హోటల్ కు అమ్మేయడం ఇలా జగదీష్ చేయని పాపాలు లేవు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి పట్టించుకోకుండా అతన్ని కొనసాగించడంతో ఈ పాపాల్లో ఆమెకూ వాటా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అంతకు మించి ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. దీంతో అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో జగదీష్ ను అనిత వదిలించుకున్నట్లు తెలుస్తోంది.
-
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications