ఆ ఆలయంలో మంత్రి వంగలపూడి అనిత పూజలు
Vangalapudi Anitha: రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. తమిళనాడులో ప్రత్యక్షం అయ్యారు. తిరువణ్ణామలైలో వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి గిరి ప్రదక్షణలో పాల్గొన్నారు అనిత. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
మొన్నటి వరకూ వంగలపూడి అనిత విజయవాడలో వరద బాధితుల కోసం చేపట్టిన సహాయక, పునరావాస కార్యకలాపాల్లో తీరిక లేకుండా గడిపిన విషయం తెలిసిందే. 10 రోజుల పాటు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, గుంటూరు జిల్లా కుంచనపల్లిలో గల విపత్తు నిర్వహణ అథారిటీ ప్రధాన కార్యాలయంలో రేయింబవళ్లు సమీక్ష సమావేశాలను నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమానంగా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆయనతో కలిసి విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించారు. స్వయంగా ట్రాక్టర్‌పై కూర్చుని సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, యనమలకుదురు, చిట్టినగర్ వంటి ప్రాంతాల్లో కలియదిరిగారు.
ఇప్పుడా పరిస్థితులు లేవు. దీనితో అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం అరుణాచలేశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాత్రివేళ అరుణాచలం గిరి ప్రదక్షిణను పూర్తి చేశారు.
ఆలయానికి వచ్చిన వంగలపూడి అనితకు ప్రొటోకాల్ ప్రకారం.. ఆలయ పాలక మండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన అరుణాచలేశ్వరుడిని దీపాలతో ఆరాధించారు. స్వామివారి కటాక్షం రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థించారు.












Click it and Unblock the Notifications