ఏపీకి డెల్, బెల్ వస్తోందని వైసీపీ డల్, రూ. 11 కోట్లకు బొత్స కక్కుర్తి: కాల్వ
ఆంధ్రప్రదే్శ్ రాష్ట్రానికి బెల్, డెల్ లాంటి కంపెనీలు వస్తోంటే వైసీపీ డల్ అయిందని ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు.
అమరావతి: ఆంధ్రప్రదే్శ్ రాష్ట్రానికి బెల్, డెల్ లాంటి కంపెనీలు వస్తోంటే వైసీపీ డల్ అయిందని ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు.
వచ్చే ఎన్నికలనాటికి ఏపీలో నిల్ అవుతోందన్నారు మంత్రి కాలువ శ్రీనివాసులు . చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కాలువ మండిపడ్డారు.

పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.తప్పుడు ఈ మెయిల్స్ పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని మంత్రి కాలువ చెప్పారు.
బొత్స రూ.11 కోట్ల కోసం కక్కుర్తి పడి వోక్స్ వ్యాగన్ కంపెనీని ఏపీకి రాకుండా చేశారని మంత్రి కాల్వ ఆరోపించారు.వైసీపీ నుండి రాష్ట్రాన్ని ప్రజలు కాపాడుకోవాలని మంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications