ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ విరమణ-కేబినెట్ నిర్ణయాల నేపథ్యంలో ప్రకటన...
ఏపీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మూడు నెలలుగా చేస్తున్న ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘం ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. నిన్నటి కేబినెట్ నిర్ణయాల నేపథ్యంలో ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు ప్రకటన చేశారు. ఉద్యోగుల ఉద్యమచరిత్రలో ఇది చారిత్రాత్మిక విజయమన్నారు. 92 రోజు ల ఉద్యమాన్ని విరమించి, మిగిలి ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.
ఏపిజెఏసి అమరావతి ఆద్వర్యంలో సియస్ కు ఫిబ్రవరి 9న ఇచ్చిన 48 డిమాండ్లలో 37 ఈ 92 రోజుల ఉద్యమం ద్వారా సాధించుకున్నామని ఉద్యోగ నేతలు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న 11 డిమాండ్లును కూడా సాధించుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. ఈ 92 రోజుల ఉద్యమకాలంలో అనేక శాఖల్లో పనిచేసే చిరు ఉద్యోగులు అంటే మునిసిపల్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులలో అనేక బాధలు గమనించామమని, భవిష్యత్లో వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.

ప్రధానంగా కొన్ని శాఖల్లో, వివిధ స్కీంల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనం పొందక, సకాలంలో జీతాలు రాక, కనీస రాయితీలు లేక పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని ఉద్యోగ నేతలు తెలిపారు. ఏపి జేఏసీ అమరావతి లక్ష్యం శాఖాపరమైన సంఘాల సమస్యలు పరిష్కరించడమే అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని ప్రతి సందర్భంలో గొంతెత్తి మాట్లాడింది, ప్రత్యేకంగా వారి కోసం ఒక రోజు ధర్నా నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి మాత్రమే అన్నారు. గ్రామ వార్డ్ సచివాలయంలోని ప్రతి ఉద్యోగి సమస్యలను బయటకు తెచ్చింది, అలాగే వారి కోసం ఒక రోజు ధర్నా నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి మాత్రమే అన్నారు.
ఈ సందర్భంగా 92 రోజుల ఉద్యమం ద్వారా ఏపీ జేఏసీ అమరావతి సాధించుకున్న విజయాలను వారు వెల్లడించారు. ఇందులో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఇతర బిల్లుల జమ, ఆర్టీసీలో పదోన్నతులు, ఆర్టీసీ ఉద్యోగులకు ఓటీఎస్, కారుణ్య నియామకాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హెచ్ఆర్ఏ పెంపు, సచివాలయ, మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటివి ఉన్నాయి. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల కోసం నిజాయితీగా చేస్తున్న పోరాటంలో ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవిగా భావించి వాటిని పరిష్కరించేందుకు అంగీకరించిన ప్రభుత్వానికి,సియస్ కు,ఇతర ఉన్నతాధికార్లకు ఉద్యోగ నేతలు ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications