ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ కు సన్నిహితుడు, కీలక నిందితుడు అరెస్ట్!
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్యమైన నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలాజీ గోవిందప్ప మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మును షెల్ కంపెనీలకు మళ్ళిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
జగన్ కు అత్యంత సన్నిహితుడు బాలాజీ గోవిందప్ప అరెస్ట్
ఈ క్రమంలో పక్కా సమాచారంతో మైసూర్ లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి విజయవాడకు సిట్ అధికారులు తీసుకువస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్ కు పూర్తికాలపు డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కాం కేసులో బాలాజీ గోవిందప్ప ఏ 33 గా ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.

జగన్ కు సన్నిహితులైన ముగ్గురికి నోటీసులు
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ దశలో ఉంది. కాగా మూడు రోజుల క్రితం బాలాజీ గోవిందప్ప తో పాటు ఏపీ సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డికి , వైసిపి అధినేత వైయస్ జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కి సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కార్యాలయంలో గత ఆదివారం ఉదయం పదిగంటలకు విచారణకు రావాలని నోటీసుల లో పేర్కొన్నారు.
నోటీసులను బేఖాతరు చేసి విచారణకు గైర్హాజరు
వీరు నోటీసులను బేఖాతరు చేశారు. విచారణకు హాజరు కాలేదు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సైతం ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం కేసులో ఈ ముగ్గురి పాత్ర కీలకమని, ఈ ముగ్గురు తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశాలను నిర్వహించారని సిట్ గుర్తించింది.
మద్యం ముడుపులు జగన్ కు చేరాయి ఇలా.. రిమాండ్ రిపోర్ట్
ముడుపులు ఎంత మొత్తం చెల్లించాలన్న దానిపైన చర్చించే వారని బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురు ముడుపులు వసూలు చేసి, వాటిని షెల్ కంపెనీలకు మళ్లించే వారని సిట్ ఇప్పటికే తేల్చింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి వీరికి చేరవేస్తే వీరు దానిని జగన్ కు అందజేసే వారని, ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టు అయిన వారి రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూర్లో తాజాగా బాలాజీ గోవిందప్ప ను అరెస్టు చేయడంతో పోలీసుల విచారణలో అతను ఏం చెప్తాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications