లిక్కర్ స్కాంలో అప్రూవర్ ? జగన్ పాత్రేంటి ? నారాయణస్వామి కీలక కామెంట్స్..!
ఏపీలో వైసీపీ హయాంలో జరిగిందని చెబుతున్న మద్యం స్కాం దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తనను ప్రశ్నించిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి నోరు విప్పారు. తొలుత మద్యం స్కాంలో తన పాత్ర లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకుంటున్న ఆయన్ను తాజాగా సిట్ అదుపులోకి తీసుకుని విచారించడం కలకలం రేపింది. అలాగే తన ఇంట్లో కోట్లు దొరికాయని, ఇందులో తాను అంతా జగన్ చూసుకున్నారని చెప్పారంటూ జరుగుతున్న ప్రచారంపై నారాయణ స్వామి స్పందించారు.
తిరుపతిలో మద్యం స్కాం తాజా పరిణామాలపై మాట్లాడిన నారాయణ స్వామి.. తనకు లేని ల్యాప్ ట్యాప్‌ను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుందని ప్రశ్నించారు. అలాగే సిట్ విచారణలో బ్రహ్మాండం బద్దలైనట్లు మీడియాలో ప్రచారం చేస్తున్నారని, తమ హయాంలో అత్యంత పారదర్శకంగా మద్యం విధానం ఉందని తెలిపారు. రాజకీయ వేధింపుల కోసమే సిట్ విచారణ అంటూ హంగామా చేస్తున్నారన్నారు. కక్షసాధింపులకే లిక్కర్ స్కాం సృష్టించారన్నారు.

ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతానని నారాయణ స్వామి సవాల్ విసిరారు. లిక్కర్ పాలసీలో ఏం తప్పు జరిగిందని అప్రూవర్‌గా మారాలని ఆయన ప్రశ్నించారు. దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారన్నారు. మరోవైపు అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ ఈ స్కాంలో తనను నడిపించారన్న ఆరోపణల్ని కూడా ఖండించారు. జగన్ తనకెప్పుడూ ఏ పని చేయాలని చెప్పలేదన్నారు.

వృద్ధాప్యం కారణంగా తనకు ఆరోగ్యం బాగోలేదని, అందుకనే గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, తన కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీని కోరానని, దీంతో జగన్ కృపాలక్ష్మికి టిక్కెట్ ఇచ్చారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు. ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేసిన తాను.. తనకేమీ తెలియదు, తనపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారని ఎలా చెబుతానని ప్రశ్నించారు. తన ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి అరెస్ట్ చేస్తున్నారని, తన ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications