తెలంగాణ ప్రకటన తర్వాత... ఏపీ రూ.800 కోట్లు కోల్పోయింది!

న్యూఢిల్లీ: విభజనకు ముందు... కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత బంద్‌ల కారణంగా ఏపీ ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. దేశంలో పారిశ్రామిక ప్రగతికి అవరోధాలుగా మారిన 12 సమస్యల పైన ఫిక్కీ, పింకెర్టాన్ సంయుక్తంగా ఇండియా రిస్క్ సర్వే-2014ని నిర్వహించాయి.

పరిశ్రమలకు అవరోధంగా నిలుస్తున్న వాటిలో అవినీతి మొదటి స్థానంలో ఉండగా, బంద్‌లు, సమ్మెలు పారిశ్రామిక అనిశ్చితికి రెండో కారణమని తెలిపింది.

 AP losses of INR 8 billion to the state exchequer

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు ముందు తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనలు, బందులు జరిగిన విషయం తెలిసిందే. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్రం ప్రకటించాక ఏపీలో బంద్‌లు జరిగాయి. వీటి ద్వారా ఏడాది కాలంలో రూ.800 కోట్లు ఏపీ నష్టపోయిందని సర్వే తెలిపింది.

పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకిగా మారిన మొత్తం 12 సమస్యల్లో 10.16 పాయింట్లతో అవినీతి తొలి స్థానంలో, 9.85 పాయింట్లతో బందులు, సమ్మెలు రెండో స్థానంలో ఉన్నాయి. 9.57 పాయింట్లతో అస్థిర ప్రభుత్వాలు మూడో స్థానంలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+