నేను నాటకాలదాన్నా?... కన్నీళ్లనూ వెక్కిరిస్తున్నావా?: నన్నపనేని రాజకుమారి భావోద్వేగం
అమరావతి: తనపై సంచలన విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీకి ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కౌంటర్ ఇచ్చారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
మీడియాను పిలిచి వారి ముందే ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నారు. తన కన్నీళ్లను కూడా ఆమె వెక్కిరించిందంటూ రాజకుమారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చిందన్నారు.

తాను మహిళల హక్కుల పరిరక్షణకు నడుం బిగించి, పర్యటనలు చేస్తుంటే, నాటకాలదాన్నని అన్నారని, సురభి నాటక కంపెనీ చరిత్ర, గొప్పదనం పద్మశ్రీకి ఏం తెలుసని ప్రశ్నించారు.
ఈ వయసులో కూడా తాను ప్రజల సమస్యలు తీర్చాలని శ్రమిస్తున్నానని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. తనపై ఆమె దారుణమైన ఆరోపణలు చేశారంటూ నన్నపనేని రాజకుమారి.. పద్మశ్రీని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications