Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ గనులశాఖలో ఎస్మా ప్రయోగానికి ఉత్తర్వులు-చర్చలు కొనసాగుతుండగానే

ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు పోరు బాట పట్టారు. వీరితో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు సఫలమైతే రేపు అర్ధరాత్రి నుంచి మొదలుకావాల్సిన సమ్మెను ఉద్యోగులు రద్దు చేసుకోనున్నారు. లేకపోతే వాయిదా వేసుకోనున్నారు. అదే చర్చలు విఫలమైతే సమ్మె మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీ సాయంతో పీఆర్సీ సాధన సమితితో చర్చలు జరుపుతోంది. అదే సమయంలో ప్రభుత్వ విభాగాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి.

రేపటి నుంచి సమ్మె ప్రారంభించేందుకు ఉద్యోగులు గతంలో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్మా ప్రయోగానికి వీలుగా ఏపీ గనులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగం తప్పదని హెచ్చరికలు చేస్తోంది. ఈ మేరకు గనులశాఖ డెరెక్టర్ వెంకట్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓవైపు ప్రభుత్వంతో పీఆర్సీ సాధనసమితి చర్చలు కొనసాగుతండగానే అధికారులు ఇలా ఎస్మా ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో చర్చల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

ap mining officials issued orders to impose esma in wake of employees strike tomorrow

Recommended Video

    Natti Kumar : Ys Jagan కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా | Oneindia Telugu

    నిన్న రాత్రి పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రుల కమిటీ ఓ దఫా చర్చలు జరిపి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వీటిపై ఇవాళ సీఎం జగన్ కు మంత్రులు వివరించారు. అనంతరం మరోదఫా పీఆర్సీ సాధన సమితి నేతలతో వారు సమావేశమయ్యారు. ఇందులో వ్యక్తమయ్యే అభిప్రాయాల్ని తిరిగి సీఎం జగన్ కు వివరిస్తారు. ఉద్యోగనేతల్ని మంత్రులు సీఎం జగన్ వద్దకు తీసుకెళతారు. అక్కడ సమ్మెపై ఉద్యోగులు ఓ ప్రకటన చేయబోతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+