రాజధానులపై డౌట్లు అక్కర్లేదు-మంత్రి అంబటి క్లారిటీ- పవన్, లోకేష్ పై సెటైర్లు..
ఏపీలో మూడు రాజధానులపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో మరో మంత్రి అంబటి రాంబాబు వీటిపై క్లారిటీ ఇచ్చారు.
విజయవాడ : ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ ఎదురవుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతున్నా.. ప్రభుత్వ పెద్దలు మాత్రం విశాఖ రాజధానిని ప్రచారం చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు కోర్టు ధిక్కార ఫిర్యాదులు వెళ్తున్నా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై మంత్రి అంబటి ఇవాళ స్పందించారు.
ఏపీ మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. వైసీపీ విధానం మూడు రాజధానులేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో సమతౌల్యత కోసమే మూడు రాజధానులని అంబటి తెలిపారు.రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా సెంటిమెంట్లు ఉన్నాయని, వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చినట్లు అంబటి వెల్లడించారు. తద్వారా మూడు రాజధానులే ప్రభుత్వ విధానమని మంత్రి క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన అంబటి.. ఆయనే చాలా పచ్చబొట్లు వేసుకోవాలన్నారు. వారాహి ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా అంటూ పవన్ ను ప్రశ్నించారు. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలని పవన్ కు అంబటి హితవుపలికారు. వైసీపీని ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం పవన్‌కే ఉందన్నారు. లోకేష్, పవన్‌లకు నిబద్ధత లేదంటూ వ్యాఖ్యానించారు.యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేరని అంబటి తెలిపారు. ప్రశాంతత బదులు ప్రశాంతత్త అని లోకేష్ అన్నారన్నారని ఆక్షేపించారు. తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా అని ప్రశ్నించారు. ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అంటూ సెటైర్లు వేశారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications