ఆ జీవో అవసరం తెచ్చింది మీరే-స్ధాయి మరిచి సీఎంపై విమర్శలా-చంద్రబాబుపై అంబటి ఫైర్..

ఏపీలో ర్యాలీలు, రోడ్ షోలను నిషేధిస్తూ వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో 1పై విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం పర్యటనలోనూ ఈ జీవోపై విమర్శలు గుప్పించారు. అంతే కాదు సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. వీటిపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు.

కుప్పం టూర్ లో చంద్రబాబు చేస్తున్న విమర్శలపై అంబటి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు స్ధాయిని మరచి సీఎం జగన్ పై చాలా విడ్డూరంగా అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు పిచ్చివాడిలా వ్యవహరిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ఇది దురదృష్టకరమన్నారు. నంబర్ 1 జీవో వచ్చాక కుప్పంలో చంద్రబాబు వీరంగం చేసే ప్రయత్నం చేశారని మంత్రి ఆరోపించారు. ఇష్టంవచ్చినట్లుగా ప్రజాస్వామ్యంలో సీఎం అయిన జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు.

ap minister ambati rambabu strong counter to chandrababu comments on ys jagan in kuppam

అసలు ఆ జీవో తేవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని మంత్రి అంబటి ఎదురు ప్రశ్నించారు. మీ ప్రచారం కోసం చేసిన ప్రయత్నంలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయారని చంద్రబాబునుద్దేశించి అన్నారు. మీరు ఎక్కడికెళ్తేఅక్కడ జనం చనిపోతున్నారని, పేద ప్రజల్ని తీసుకొచ్చి వారి మరణానికి కారణమవుతున్నారని చంద్రబాబును విమర్శించారు. ఇలాంటి వ్యక్తుల్ని, సభల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని అడిగారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పోతుందని, ప్రజాస్వామ్యం పోతుందని పెద్ద పెద్ద విమర్శలు చేస్తున్నారన్నారు. రోడ్లపై మీటింగ్స్ పెట్టుకోవద్దని పెట్టుకోవద్దన్నాం తప్ప రాష్ట్రంలో ఎక్కడా పెట్టొద్దని చెప్పలేదన్నారు.ఈ జీవో ఓసారి పూర్తిగా చదువుకోమని సూచించారు. కుప్పంలో అన్నీ ఓడిపోయాక, దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇవాళ కుప్పంలో హంగామా చేస్తున్నారన్నారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+