నాగబాబుకు అంబటి కౌంటర్-సంబరాల రాంబాబునే..కానీ రంగేయను, ప్యాకేజీ తీసుకోను..!

ఏపీలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకూ, జనసేనకూ మధ్య పోరు నానాటికీ తీవ్రమవుతోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అంబటి పెట్టే ట్వీట్లకు ఆయన సోదరుడు కొణిదెల నాగబాబు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. దీంతో అంబటి కూడా వాటికి తిరిగి కౌంటర్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో సంక్రాంతి సందర్భంగా వీరిద్దరి మధ్య సాగుతున్న ట్వీట్ వార్ ఆసక్తికరంగా ఉంది.

అంబటి వర్సెస్ జనసేన వార్


వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకూ, జనసేన నేతలకూ మధ్య ట్వీట్ వార్ ముదురుతోంది. తాజాగా శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అంబటి రాంబాబు ట్వీట్లు పెట్టారు. దీంతో ఆయన ట్వీట్లకు జనసేన నుంచి కౌంటర్లు కూడా పడటం మొదలైంది. ఈ వార్ కాస్తా సంక్రాంతి వైపు మళ్లింది. సంక్రాంతి సందర్భంగా అంబటి డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేసుకోవడంపై జనసేన నేతలు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. దీంతో అంబటి కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.

సంబరాల రాంబాబు ట్వీట్

నిత్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, తమ పార్టీని టార్గెట్ చేస్తున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి
సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో డాన్స్ చేశారు. దీన్ని టార్గెట్ చేస్తూ మెగా బ్రదర్ నాగబాబు ఓ ట్వీట్ పెట్టారు. అందులో సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు... పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది ! అంటూ నాగబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. దీంతో ఈ ట్వీట్ ను జనసేన శ్రేణులు సంబరాల రాంబాబు పేరుతో వైరల్ చేయడం మొదలుపెట్టారు.

అంబటి రియాక్షన్

అంతకు ముందు శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ కూడా సంబరాల రాంబాబు అంటూ అంబటిని పరోక్షంగా విమర్శించారు. దీంతో సంబరాల రాంబాబు వ్యాఖ్య అంబటిని ఎక్కడో తాకింది. ఈ కామెంట్ పై అంబటి ఇవాళ తీవ్రంగా స్పందించారు. నువ్వు, మీతమ్ముడు అన్నట్టు "సంబరాల రాంబాబు"నే ! కానీ...ముఖానికి రంగు వేయను, ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! అంటూ వైసీపీ మంత్రి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ నేతలంతా పవన్ ను ప్యాకేజీ స్టార్ అని విమర్శలు చేస్తున్న వేళ అంబటి ట్వీట్ పవన్ ను, నాగబాబును ఇరిటేట్ చేసేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+