టికెట్ల ధరలు నచ్చకపోతే "భీమ్లా నాయక్"ను వాయిదా వేసుకోండి..! రచ్చెందుకు? : మంత్రి బొత్స
ప్రపంచ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ సినిమా "భీమ్లా నాయక్" విడుదలైంది. పవన్ ఫ్యాన్స్ అనందంతో ఫుల్ హంగామా చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు విధించింది. ప్రత్యేక షోలకు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పవన్ సినిమాను జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకోవాలని కుట్ర చేస్తోందని మండిపడతున్నారు. గుడివాడలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి నిరసన సెగ కూడా తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వ్యవస్థ ఒక్కరి కోసం పనిచేయదు
తాజాగా "భీమ్లా నాయక్" సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక షోలపై ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలపై ప్రభుత్వం కమిటీ వేసింది. నివేదిక రావాల్సి ఉందన్నారు. మనం ఒక వ్యవస్థలో ఉన్నామన్న సంగతి మరవరాదన్నారు. దాని ప్రకారం మనం నడుచుకోవాల్సి ఉంటుందన్నది గుర్తించుకోవాలన్నారు. తమ ప్రభుత్వం చట్టం ప్రకారం ముందుకు వెళ్తోందన్నారు. వ్యవస్థ ఒక్కరికోసం పనిచేయదని స్పష్టం చేశారు.

"భీమ్లా నాయక్"ను వాయిదా వేసుకోండి..
టికెట్ల ధరలు నచ్చకపోతే "భీమ్లా నాయక్" సినిమాను వాయిదా వేసుకోవచ్చంటూ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్టదు .. కానీ, సినిమాల గురించి మాత్రం తెగ మాట్లాడుతున్నారని చురకులు అంటించారు. టీడీపీ నేతలకు ప్రతిది రాజకీయం చేయడం అలవాటైందని మందిపడ్డారు.

అమరావతి రైతులది రాజకీయ ఉద్యమం
అమరావాతి రైతులు చేస్తుందని ఉద్యమం కాదని బొత్స విమర్శించారు. అది ఒక రాజకీయ ఉద్యమం.. కేవలం టీడీపీ చేసే ఉద్యమమని ఆరోపించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రా విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పథకం , హౌసింగ్‌పై ఏమైనా సమస్యలు ఉంటే లబ్ధిదారులు .. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. తమది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications