తునిలో యనమల పతనం ఇలా.. గుర్తుచేసిన ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ..!
ఏపీలో కాకినాడ జిల్లా తుని నియోజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వరుస విజయాలతో జగన్ కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు. అక్కడ టీడీపీ దిగ్గజ నేత యనమల రామకృష్ణుడు రాజకీయంగా పతనం కావడంతో అక్కడ దాడిశెట్టి వరుసగా విజయాలు సాధిస్తున్నారు. తాజాగా యనమల చేసిన విమర్శలపై స్పందించిన మంత్రి దాడిశెట్టి..
కంసుడికి కృష్ణుడు, రావణుడికి రాముడు కూడా చరిత్రలో దుర్మార్గుల్లా కనిపించారని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. దుర్మార్గుడైన యనమల రామకృష్ణుడు పాలనలో 35 మంది ప్రాణాలు తీశారని ఆరోపించారు. చంపేయడం, ట్రైన్ లో పడేయడం చేశారనన్నారు. 2018లోనూ ముక్కుపచ్చలారని కుర్రాడిని చంపేసి ఇలాగే ట్రైన్ లో పడేశారన్నారు. 2014లో అధికారం వచ్చాక హైకోర్టు తుని నుంచి ఒకే నెలలో 137 అట్రాసిటీ కేసులు వస్తే హైకోర్టు జడ్జి ఎస్పీకి నోటీసు పంపారన్నారు. ఎందుకు ఇలా కేసులు వస్తున్నాయని ప్రశ్నించారు. ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు యనమల దుర్మార్గాలు అంతా ఇంతా కాదన్నారు

తునిలో రైలు తగలబడగానే ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ రౌడీలు చేశారని చంద్రబాబు ఆరోపించారని, కానీ తునిలో మైనార్టీలు, ఎస్సీలు, కాపులపై కేసులు పెట్టి వేధించారని మంత్రి దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. తుని ప్రజలకు యనమల నరకం చూపించారన్నారు. పెన్షన్ పేరు చెప్పి 500 తీసుకోవడం, మరుగుదొడ్ల పేరుతో మండలానికి 9 వేలు తీసుకున్నారన్నారు. తుని ప్రజలు యనమలను ఛీ కొట్టారన్నారు. తాను ఎన్నికల్లో గెలవడానికే వ్యూహాలు రచిస్తానని, యనమల సోదరులు ఎలా కొట్టుకుంటే నాకు అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications