అలా వదిలేయకండ్రా.. పవన్ ను డాక్టర్ కు చూపించాలంటున్న ఏపీ మంత్రి...
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. మూడు రోజులుగా పవన్ తన వారాహి యాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న సభల్లో సీఎం పదవిపై వరుసగా సంచలన చేస్తున్నారు. దీనిపై జిల్లా మంత్రి దాడిశెట్టి రాజా ఇవాళ కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవి తర్వాత ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడం కూడా కష్టమే అన్నారు. పవన్ సభలు వరుసగా ప్లాఫ్ అవుతున్నాయంటూ రాజా వ్యాఖ్యానించారు.
పవన్ వారాహి యాత్ర ఫెయిల్ అయిందని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. సభలకు జనం రాకపోతే పవన్‌కు యజమాని ప్యాకేజీ ఇవ్వరంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అవ్వాలన్నా..సీఎం కావాలన్నా జనం ఓట్లేయాలని,పవన్ ఎక్కడ పోటీచేయాలో కూడా యజమాని డిసైడ్ చేయాలంటూ దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. బాబా అవతారమెత్తిన పవన్ ఇప్పుడు అమరావతి అంటున్నారన్నారు. ఒక్కరోజైనా కుటుంబంతో పవన్ అమరావతి వచ్చాడా అని ప్రశ్నించారు.
పవన్‌ను మానసికవైద్యుడికి చూపించాలని దాడిశెట్టి రాజా సూచించారు.

2014లో జనసేనతో కలిసి చంద్రబాబు రూపొందించిన మ్యానిఫెస్టోను అమలు చేయకపోతే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి దాడిశెట్టి రాజా నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలను కూల్చేస్తే కూడా పవన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. కోట్ల మందిని చంద్రబాబు మోసం చేసినా పవన్ అడగలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని, కానీ టీడీపీ హయాంలో శాంతి భద్రతలు విఫలమైతే పవన్ మాత్రం ప్రశ్నించలేదని రాజా గుర్తుచేశారు.
పవన్ సీఎం అయిపోవాలనుకుంటే అయిపోరని, ప్రజలు ఓట్లేస్తేనే అవుతారని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. సీఎం పదవిపై వరుసగా పవన్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన కార్యకర్తలు ఆయన్ను డాక్టర్ కు చూపించాలని మంత్రి సూచించారు. పవన్ పరిస్ధితి బాగోలేదని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications