అన్నదాత అవస్థకు చలించిన ఏపీ మంత్రి గొట్టిపాటి-3 గంటల్లో తేల్చేసిన వైనం..!
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎంత చేసినా తక్కువే. క్షేత్రస్దాయిలో వారు ఎదుర్కొనే సమస్యలను పూర్తిస్దాయిలో పరిష్కరించడం అధికారుల వల్ల కావడం లేదు. పైకి ఎన్ని మాటలు చెప్పినా రైతుల అసలు సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు పడటం లేదు. ఇదే క్రమంలో రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తన దృష్టికి వచ్చిన ఓ రైతు సమస్యను చూసి చలించిన ఆయన కేవలం 3 గంటల్లోనే పరిష్కారం చూపించారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా ఖాజీపేట నాగసాని పల్లెలో అబ్బయ్య అనే రైతు పొలం పై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు గాలికి కిందకు వంగిపోయి నేలను తాకుతుండేవి. దీంతో రైతు అబ్బయ్య తన సొంత పొలంలోకి వెళ్లలేని పరిస్ధితి నెలకొంది. అలాగని వ్యవసాయం చేయకుండా ఉండటం కష్టం. కొన్నేళ్లుగా ఇదే పరిస్ధితి ఎదుర్కొంటున్న ఆయన.. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా వర్షాలు కురుస్తుండటంతో దుక్కిదున్నుకునేందుకు మరోసారి రైతు సిద్ధమయ్యాడు.

ఈ క్రమంలో తన పొలానికి అడ్డుగా ఉన్న కరెంటు తీగల్ని కుటుంబ సభ్యుల సాయంతో పైకి ఎత్తి పట్టుకునేలా చేసి నారుమళ్లు వేస్తున్నాడు. స్థానికులు ఈ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఏపీ విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టిలో పడింది. రైతు అవస్థ చూసి చలించిన విద్యుత్ మంత్రి.. వెంటనే అధికారుల్ని పిలిపించి మాట్లాడారు. తక్షణం వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల్ని పరుగులుపెట్టించడమే కాకుండా కేవలం 3 గంటల్లోనే సమస్య పరిష్కరించారు.
అప్పటివరకూ నిర్లక్ష్యంగా ఉండిపోయిన అధికారులు కాస్తా మంత్రి ఆదేశాలతో పరుగులు తీశారు. రైతు అబ్బయ్య పొలంలో నేలను తాకుతున్న విద్యుత్ తీగల్ని పక్కనే స్తంభం ఏర్పాటు చేసి పైకి ఎక్కించారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యను మంత్రి కేవలం 3 గంటల వ్యవధిలోనే పరిష్కరించడంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చొరవతో రైతు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications