మారకపోతే క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీమ్ ! జగన్ కు చంద్రబాబు మంత్రి వార్నింగ్..!
ఏపీలో తాజా ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ 11 సీట్లు మాత్రమే సాధించడంతో అసెంబ్లీలో విపక్ష హోదా ఇచ్చే పరిస్ధితి లేకుండా పోయింది. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ మాత్రం తనను ప్రధాన విపక్ష నేతగా గుర్తించాలంటూ తాజాగా స్పీకర్ అయన్నపాత్రుడికి రాసిన లేఖ సంచలనంగా మారింది. స్పీకర్ విచక్షణ మేరకు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని బెదిరింపులతో సాధించుకోవాలని చూస్తున్నారంటూ జగన్ పై మంత్రులు విరుచుకుపడుతున్నారు.
ఇదే క్రమంలో స్పీకర్ కు జగన్ రాసిన లేఖపై స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. రాజకీయాలు మార్చుకోవాలని ఆయనకు హితవు పలికారు. మీ రాజకీయాలు మార్చుకోకపోతే క్రికెట్ టీం (వైసీపీ 11 ఎమ్మెల్యేలు) కాస్తా వాలీబాల్ టీం (ఆరుగురు) అవుతారంటూ మంత్రి హెచ్చరించారు. జగన్‌ను జనం పాతాళానికి తొక్కేసినా బుద్ది మార్చుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. అర్హత లేకున్నా చంద్రబాబు ఆదేశంతోనే అసెంబ్లీలో గౌరవం లభించిందన్న విషయాన్ని మంత్రి రవికుమార్ గుర్తుచేశారు.

జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని మంత్రి గొట్టిపాటి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని, లేదంటే ఇప్పుడున్న క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతుందని ఆయన కున్న ఎమ్మెల్యేలను గుర్తుచేస్తూ మంత్రి హెచ్చరించారు. నిన్న మంత్రులు సంధ్యారాణి, నిమ్మల రామానాయుడు సైతం జగన్ స్పీకర్ కు రాసిన లేఖపై విమర్శలు గుప్పించారు.
జగన్‌ను ప్రజలు పాతాళానికి తొక్కేశారని, అయినప్పటికీ చంద్రబాబు పెద్దమనసుతో ఆయనకు గౌరవం ఇవ్వాలని ఆదేశించారని, అర్హత లేకున్నా గౌరవం లభించింది అందుకేనని గుర్తుచేశారు. ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారని పేర్కొన్నారు. అయినప్పటికీ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని లేఖ రాసి తన బుద్ధి మారలేదని నిరూపించుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications