హరిరామజోగయ్యను ఏకేసిన మంత్రి అమర్నాథ్..! షాకింగ్ కామెంట్స్..

ఏపీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీగా సాగుతున్న వార్ మరిన్ని మలుపులు తీసుకుంటోంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా గతంలో ముద్రగడ, మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు కాపు నేత హరిరామజోగయ్య ఘాటు కౌంటర్లు ఇచ్చారు. దీంతో గుడివాడ కూడా ఆయనకు ఉత్తరాలు రాస్తూ తిరిగి కౌంటర్లు ఇచ్చారు. తాజాగా పవన్ ను టార్గెట్ చేస్తూ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇవాళ హరిరామజోగయ్య చేసిన విమర్శలతో మళ్లీ గుడివాడ లైన్లోకి వచ్చారు.

గౌరవనీయులు, పెద్దలు శ్రీ హరిరామజోగయ్య గారికి బహిరంగ లేఖ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనకు ఓ లేఖ రాశారు. ఇందులో మా నాన్న గారితో మీకున్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని గుడివాడ గుర్నాథరావు గారి కొడుకుగా ఈ ఉత్తరం రాస్తున్నానన్నారు. మీకు ఇలాంటి ఉత్తరం రాస్తున్నందుకు బాధగానే ఉన్నా, మీరు ఎంత స్థాయికి దిగజారిపోయారో, మీరే సమాజంలో నిరూపించుకున్న తర్వాత, ఇక నాబోటి వారికి మీకు సమాధానం చెప్పక తప్పటం లేదన్నారు.

gudivada amarnath harirama jogaiah

ఏ మనిషికైనా వయసు పెరిగేకొద్దీ సంస్కారం పెరుగుతుందని అంటారని, మీకు మాత్రం పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ అశ్లీలత పెరుగుతోందని అమర్నాథ్ ఆరోపించారు. ఇలాంటి చెత్త ఉత్తరాలను జనం మీదకు వదిలి మీరు కూడా స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీపడాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని విమర్శించారు. జోగయ్య గారూ.. సన్సేషన్ కావటం కోసం అడ్డమైన వాగుడు వాగి, టీవీలకు, పత్రికలకు, సోషల్ మీడియాకు అందులో కూడా ప్రత్యేకించి ఎల్లో మీడియాకు మీరు మేత అందించాలనుకుంటున్నారు. మీ దిగజారుడుతనం పగవాడికి కూడా వద్దన్నారు.

చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి..? అని గుడివాడ ప్రశ్నించారు. పవన్ పుట్టిందే బాబు కోసం, పవన్ పెరుగుతున్నదే ఎల్లో మీడియాలో, పవన్ కు నిర్మాతలంతా బాబు మనుషులే అన్నారు. మరి మీరు కూడా మరో ప్యాకేజి స్టార్ కావడానికి వీలుగా బాబుని, బాబు మీడియాని, బాబు వర్గాన్ని సంతోషపరచడానికి ఈ చీప్ టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారని భావించాలా..? అని జోగయ్యను మంత్రి ప్రశ్నించారు.

ఎంతో గొప్ప రాజకీయ జీవితాన్ని అనుభవించిన మీ పట్ల వ్యక్తిగతంగా మాకు ఏ రకమైన శతృత్వంగానీ, వ్యతిరేకతగానీ లేదని మంత్రి గుడివాడ తెలిపారు. కానీ, మీ రాతలు, మీ భావాలు, మీ దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయని, మీ పద్ధతి బాగుందో, లేదో, కనీసం మీ పిల్లల్ని, మీ శ్రేయోభిలాషులను కనుక్కుని మీరు విచక్షణతో, విజ్ఞతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ లేఖను ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+