హరీష్ రావుకు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్-నీదీ దాడుల చరిత్ర-కేసీఆర్ తో గొడవలు చూసుకో
ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనలో టీచర్ల దుస్ధితిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఏపీలో టీచర్ల దుస్ధితిని తెలంగాణతో పోలుస్తూ అక్కడి టీచర్లతో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీలో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇవాళ ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ గురించి చేసిన వ్యాఖ్యలపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇవాళ ఓ వీడియో సందేశంలో గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సిన దుస్దితి వైసీపీకి లేదన్నారు. కేసీఆర్ కూ, హరీష్ రావుకూ తగువులుంటే వారూ వారూ చూసుకోవాలని అమర్నాథ్ సూచించారు. అంతే కానీ మా రాష్ట్రంపై ఎందుకు పడతారని ప్రశ్నించారు. మమ్మల్ని తిడితే మీకు అక్కడేమైనా మార్కులు పడతాయా అని అమర్నాథ్ హరీష్ రావును నిలదీశారు.

ఏపీతో పోలిస్తే తెలంగాణ ఆర్ధిక పరిస్ధితి ఎంతో బావుందని, హైదరాబాద్ ఉండటం వల్ల ఆర్ధిక పరిస్ధితి బావుండి ఏం సంక్షేమం చేస్తున్నారో చెప్పమని మంత్రి గుడివాడ అమర్నాథ్ హరీష్ రావును ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వాధికారుల్ని హరీష్ ఎలా ట్రీట్ చేశారో ప్రజలు చూశారని గుర్తుచేశారు. ఏపీ భవన్ లో ఓ అధికారిని హరీష్ రావు కాలితో తన్నలేదా అని అమర్నాథ్ ప్రశ్నించారు. మామా అల్లుళ్లకు తగువులుంటే చూసుకోవాలన్నారు. మా రాష్ట్రానికి నీతులు చెప్పే, సూచనలు చెప్పే అర్హత ఆ ప్రాంతంలోని నాయకులకు లేదని మంత్రి గుడివాడ హితవు పలికారు.
హరీష్ రావుకు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్#Andhrapradesh #Gudivadaamarnath @Apminister #Harishrao #Kcr pic.twitter.com/nLjPBR1DZc
— oneindiatelugu (@oneindiatelugu) September 30, 2022












Click it and Unblock the Notifications