ఉనికి కోసమే బాబు, పవన్ ప్రయత్నాలు-ముద్రగడ లేఖ చదివితే జంప్ ! మంత్రి జోగి కామెంట్స్..
విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలపై ఏపీ మంత్రి జోగి రమేష్ ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. నిన్న రేపల్లెలో చనిపోయిన బాలుడు అమర్నాథ్ కుటుంబ పరామర్శ పేరుతో చంద్రబాబు, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు జోగి కౌంటర్ ఇచ్చారు. సాయం చేయాల్సిన చోట చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాగే ముద్రగడ రాసిన లేఖను పవన్ చదివితే తిరిగి హైదరాబాద్ పారిపోతాడన్నారు.
నిన్న రేపల్లె నియోజకవర్గం ఉప్పాలవారిపాలెంలో మృతిచెందిన అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి అక్కడ చంద్రబాబు శవరాజకీయం చేశాడని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. డర్టీ పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా చంద్రబాబును చెప్పుకోవాల్సిందేనన్నారు. ఎవరైనా ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు బాధితుల్ని కలిసి వారితో మాట్లాడి వీలైతే సాయం చేసి ధైర్యం చెబుతారని, కానీ చంద్రబాబు మాత్రం అమర్నాథ్ సోదరి, తల్లిని కలిసి బయటకొచ్చి సభపెట్టి శవాలపై పేలాలేరుకున్నట్లు ఓట్లు అడుక్కున్నాడన్నారు.

అమర్నాథ్ కుటుంబానికి తాము అన్నివిధాలా అండగా ఉన్నామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. అమర్నాథ్ సోదరి, తల్లిని కలిసి మాట్లాడి వారికి ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ ఇచ్చిన హామీని వివరించామన్నారు. బాధితుని సోదరికి ఇప్పటికిప్పుడు ఉద్యోగం కల్పించడంతో పాటు తాను చదువుకుంటానంటే ఆ బాధ్యతను సైతం ప్రభుత్వమే చూసుకుంటుందంటూ వారికి వివరించి ధైర్యం చెప్పామన్నారు. వీటితోపాటు వారి కుటుంబానికి ఇప్పటికే ఇంటి స్థలం మంజూరు చేయడంతోపాటు ఇంటి నిర్మాణం కూడా చేపడతామని చెప్పిన ప్పుడు వారు ఊరటపొందారన్నారు. కానీ తమ ఎంపీ మోపిదేవి వెళితే టీడీపీ శవరాజకీయం చేసి అడ్డుకుందన్నారు.

చంద్రబాబు పరిపాలనలో జరిగిన రిషితేశ్వరి, వనజాక్షి, విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ ఘటనలపై జోగి రమేష్ ప్రశ్నించారు. అందుకే, రాష్ట్రంలో ఆడబిడ్డలంతా 2019 ఎన్నికల్లో మీకు గుండుగీసి సున్నం బొట్టు పెట్టారన్న సంగతిని గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. అలాగే బాబును బీసీ సోదరులెప్పుడో వదిలేశారన్నారు. అలాగే పవన్ కాపులకు సంబంధించిన అంశాల్లో లోతైన విశ్లేషణతో ముద్రగడ గారు రాసిన లేఖను ఆసాంతం చదివితే చాపాదిండు పట్టుకుని హైదరాబాద్ పారిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అయిపోయిందని, అటు లోకేశ్ పాకులాడినా.. ఇటు పవన్ వారాహీ ఎక్కి తిరిగినా వీరిలో ఏ ఒక్కరూ ఎన్నికల్లో గెలిచేది లేదన్నారు. పవన్‌కళ్యాణ్ పూటకో మాట చెబుతూ తానేదో పెద్ద వ్యూహకర్తననే భ్రమల్లో బతుకుతున్నాడని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ సీఎంగా గెలుస్తాడా అన్నది ఆలోచించుకోవాలన్నారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications