వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్! ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే కాగలవా?, చంద్రబాబులాగే: ఏపీ మంత్రులు ఏకిపారేశారుగా

|
Google Oneindia TeluguNews

అమరావతి: మూడు రాజధానులు ఖచ్చితంగా ఏర్పడి తీరతాయని ఏపీ మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అంతేగాక, మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని, స్థానిక ఎన్నికల్లో తమకు 85 శాతం ప్రజల మద్దతు రావడమే దీనికి నిదర్శనమన్నారు.

చంద్రబాబు కలలు ఎప్పటికీ నెరవేరవు: కన్నబాబు

చంద్రబాబు కలలు ఎప్పటికీ నెరవేరవు: కన్నబాబు


మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందుకే రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. మూడు రాజధానులు కట్టడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కన్నబాబు కొట్టిపారేశారు. మూడు రాజధానులు కడతామో లేదో.. వైసీపీ వల్ల అవుతుందో.. లేదో అనేది త్వరలోనే చూస్తారన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందకూడదనే టీడీపీ భావిస్తోందని విమర్శించారు. ఒక ప్రాంతానికే పరిమితం కావాలని అనుకుంటే బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా వెళ్లొచ్చన్నారు. రెండున్నరేళ్లలో అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు కలలు కంటున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.

చంద్రబాబు అలా.. జగన్ ఇలా.. అంటూ కన్నబాబు

చంద్రబాబు అలా.. జగన్ ఇలా.. అంటూ కన్నబాబు

చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ జగన్‌ రైతుల పక్షాన నిలబడతారని చెప్పారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గులాబ్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో తన పదవీకాలం పూర్తయ్యేనాటికి కూడా ఇవ్వలేదు. సకాలంలో చంద్రబాబు ఏనాడూ ఇవ్వలేదు. రైతు పక్షపాతి జగన్ ఇప్పటి వరకు రూ.1,070 కోట్లు ఇచ్చారు. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. కేంద్రం రైతాంగాన్ని ఆదుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత సోము వీర్రాజు అంటున్నారని, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేయలేదో ఆయన చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. కేంద్రం రైతుల పక్షాన ఉంటే ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

లోకేష్, చంద్రబాబు కట్టుకథలుం కన్నబాబు ఫైర్

లోకేష్, చంద్రబాబు కట్టుకథలుం కన్నబాబు ఫైర్


దొంగ ఓట్ల ఆరోపణలపై మంత్రి కన్నబాబు స్పందిస్తూ.. కుప్పం ప్రజల్లో మార్పు వచ్చింది. టీడీపీ వారు వైసీపీ దొంగ ఓట్లు వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డార. అసలు ఓటరు ఐడీ లేకుండా ఓటరు పోలింగ్ బూతులోకి ఎలా వెళ్లగలరు?. చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. లోకేష్ రెండు రోజులు పర్యటించి స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టుకున్నారు కదా?. మరి ఎలా దొంగ ఓట్లు వేయగలరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి రైతులను మోసం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. మా నిర్ణయాలను ప్రజలు అంగీకరిస్తున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే మిగతా ప్రాంతాల ప్రజలు సరైన బుద్ది చెప్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అక్కర్లేదనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. కర్నూలే రాజధాని అన్న నాయకులు ఇప్పుడు ఏమయ్యారు?' అని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు.

లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే కాగలడా?: బాబులానే అంటూ బొత్స

లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే కాగలడా?: బాబులానే అంటూ బొత్స


మరోవైపు, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ ఎన్ని జన్మలు ఎత్తినా.. ఎమ్మెల్యే అవ్వగలడా...? అంటూ ఎద్దేవా చేశారు. వైజాగ్ కు పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉన్నాయి.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ నుంచి తాము పారిపోమన్నారు. ఈ రాష్ట్రంలో మాకో అడ్రెస్ ఉంది.. ప్రతిపక్ష నేతలే వలస పక్షులు అంటూ కౌంటర్‌ ఇచ్చారు బొత్స. తమకు బీజేపీ రాజకీయ మిత్రపక్షం కాదని తెలిపారు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటే.. మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని స్పష్టం చేశారు. 13 మునిసిపాలిటీలు ఎన్నికలు జరిగాయని, అన్ని కూడా వైసీపీ నే విజయం సాధిస్తుందని భావిస్తున్నామని బొత్స చెప్పారు. 22 ఇంకా జరగలిసి ఉంది... కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వస్తే వాటికి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు కుప్పం లో ఏమి చేస్తున్నారో చూస్తున్నామని.. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఓడిపోయే వాడే చంద్రబాబులాగా మాట్లాడతారని చురకలంటించారు బొత్స. చంద్రబాబు కుప్పంకి నీళ్ళు ఇవ్వలేదని అనడానికి సిగ్గులేదని ఫైర్‌ అయ్యారు. 40 ఏళ్ళు కుప్పానికి ఎమ్మెల్యే ఎవరున్నారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడని, దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికి తెలుసని, ఒడిపోతామని తెలుసు కాబట్టే దొంగ ఓట్లు, అల్లర్లు అంటూ ఆరోపణలు చేస్తున్నారని బొత్స ఫైరయ్యారు. ఏపీలో ముమ్మాటికీ మూడు రాజధానులు ఉంటాయని, అడ్డుకోవడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటిని ఎవ్వరు ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేశారు.


English summary
AP minister Kannababu and Botsa Satyanarayana slams chandrababu and lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X