వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు చంద్రబాబు సంఘ సంస్కర్త , మహానేత.. ఆయనంటే ప్రేమ.. పవన్ పై కన్నబాబు సెటైర్లు

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపు మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడానికి ప్రారంభించిన వైయస్సార్ కాపు నేస్తం పథకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .కాపు నేతలకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న పవన్ కళ్యాణ్, కాపు రిజర్వేషన్లపై దృష్టి మరల్చడానికి తెలివిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగా వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ ప్రభుత్వం గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్న రీతిలో ఏ పథకం కింద లబ్ధి చేకూరినా సరే అది కాపులకు ప్రత్యేకంగా కలిగిన ప్రయోజనం అంటూ గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు పట్ల ఉన్న ప్రేమను పవన్ దాచుకోలేకే దుష్ప్రచారం

చంద్రబాబు పట్ల ఉన్న ప్రేమను పవన్ దాచుకోలేకే దుష్ప్రచారం


కాపు నేస్తం అద్భుతమైన పథకమని, కాపు నేస్తం కింద కాపు మహిళలకు ఏటా 15 వేల అందిస్తున్నామని వ్యాఖ్యానించిన ఆయన కాపుల కోసం ఏడాదిలో 4769 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక కాపు నేస్తం పథకం పై పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించిన ఆయన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కాపులను మోసం చేసినా పట్టలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పట్ల ఉన్న ప్రేమను పవన్ కళ్యాణ్ దాచుకోలేక పోతున్నారని వ్యాఖ్యలు చేశారు మంత్రి కన్నబాబు.

చంద్రబాబు ముద్రగడను పచ్చిబూతులు తిట్టినా పవన్ స్పందించలేదు ఎందుకో

చంద్రబాబు ముద్రగడను పచ్చిబూతులు తిట్టినా పవన్ స్పందించలేదు ఎందుకో

నాడు టిడిపి హయాంలో చంద్రబాబు ముద్రగడను పచ్చిబూతులు తిట్టినా పవన్ ఎందుకు స్పందించలేదు చెప్పాలని ప్రశ్నించారు. అంతే కాదు ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు అణచివేశారని,ఇక కాపులను మోసం చేసిన చంద్రబాబు పవన్ కు ప్రపంచ సంస్కర్తలా కనిపించారని,చంద్రబాబు మహానేత అన్నట్టు ఆనాడు చంద్రబాబు కు పవన్ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నచ్చడు కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని కన్నబాబు వ్యాఖ్యానించారు.

కులాల పేరుతో రాష్ట్రాన్ని విభజించింది చంద్రబాబేనని విమర్శ

కులాల పేరుతో రాష్ట్రాన్ని విభజించింది చంద్రబాబేనని విమర్శ



కులాల వారీగా ఎవరికెంత లబ్ధి చేకూరింది లెక్కలు విడుదల చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, కులాల పేరుతో రాష్ట్రాన్ని విభజించింది చంద్రబాబేనని కన్నబాబు పేర్కొన్నారు.ఇక పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నచ్చక విమర్శలు గుప్పిస్తున్నారు అని ప్రెస్ నోట్ లో కూడా జగన్ రెడ్డి అని రాస్తారని పేర్కొన్నారు కన్నబాబు. కులం అనేది దాచి పడితే దాగేది కాదని,అనవసరంగా కులం పేరుతో ఎద్దేవా చేసే కార్యక్రమం పవన్ చేపట్టడం మంచిది కాదని హితవు పలికారు.

ఏం ఆశించి పవన్ విమర్శలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ప్రశ్న

ఏం ఆశించి పవన్ విమర్శలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ప్రశ్న


50 శాతం ఓట్లతో ప్రజలు వైసిపిని దీవించారని,అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి అందరినీ సమభావంతో చూస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ ను విమర్శించడంతో పవన్ కళ్యాణ్ కు చేకూరే లాభం ఏంటో తెలియడం లేదని, ఏం ఆశించి పవన్ విమర్శలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. చంద్రబాబు అంటే పవన కు ప్రేమ అని లింక్ పెట్టి మరీ విమర్శలు చేశారు .

English summary
Kapu Nestam is a wonderful scheme and that under the Kapu Nestam, 15,000 rupees financial aid for women are provided annually to Kapu said minister kannababu. He criticized Pawan Kalyan's allegations on the Kapu Nestam scheme and said that Pawan Kalyan had not questioned Chandrababu . Pawan Kalyan cannot hide his love for Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X