పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం సెక్యూరిటీ కావాలా? చంద్రబాబు మంత్రి సెటైర్లు..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన భద్రత తగ్గింపును సవాల్ చేస్తూ హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తనకు ఎన్నికల ఫలితాలకు ముందున్న భద్రత పునరుద్ధరించాలని కోరారు. అయితే నిబంధనల ప్రకారం సాధ్యం కాదని తెలిసినా జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అధికారులు కూడా జగన్ డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని, నిబంధనల ప్రకారమే జగన్ కు భద్రత కల్పిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర కూడా జగన్ సెక్యూరిటీ పిటిషన్ పై స్పందించారు. తన భద్రత పెంచాలని జగన్ అంటున్నారని, అసలు జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కొల్లు రవీంద్ర తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ ఉండదని ఆయన గుర్తుచేశారు. సీఎం, ప్రధాని తరహా భద్రత ఉండదని జగన్ తెలుసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారమే జగన్ కు భద్రత కల్పిస్తామన్నారు.

ap minister kollu Ravindra reacted to ys jagan s security cut petition in high court

చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో తట్టుకోలేకపోతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారన్నారు. పాపాలు చేసిన వారిని దోషులుగా నిలబెట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూప్ పెట్టడాన్ని పేర్ని నాని వక్రీకరిస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థి కూడా అయిన కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. ఫలితాలు రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ, కొడాలి నాని పారిపోయారని, వారిని పేర్ని నానినే దాచాడనే అనుమానాలు ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+