మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం: తీవ్ర గుండెపోటు- చికిత్స పొందుతూ..!!
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. మంత్రి గౌతమ్ రెడ్డి(49) గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసారు. తాజాగా దుబాయ్ లో జరిగిన బిజినెస్ ఎక్స్ పో లో పాల్గొన్న ఆయన ఈ ఉదయం ఒక్క సారిగా గుండెపోటుతో కుప్ప కూలారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. నిత్యం జిమ్ లో కసరత్తు చేస్తూ.. ఆరోగ్యం గా ఉండే గౌతమ్ రెడ్డి ఈ విధంగా గుండెపోటుకు గురవ్వటం వైసీపీలో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ మంత్రి ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీసారు. అయితే, చికిత్స పొందుతూ మంత్రి మరణించారు
Recommended Video
ఒక్క సారిగా కుప్పకూలిన మంత్రి
ఆయనకు చివరి నిమిషం వరకు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారు.. దుబాయ్ పర్యటనలో బాగా అలిసిపోయినట్లుగా మంత్రి కనిపించారని సిబ్బంది చెబుతున్నారు. అయితే, వైద్యులు ఆయన మరణించినట్లుగా వెల్లడించారు ప్రస్తుతం ఆయన ఏపీ ఐటీ..పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్నారు. ఆత్మకూరు నుంచి రెండో సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా నేతలు హైదరాబాద్ ఆపోలోకు తరలి వస్తున్నారు.

నిత్యం జిమ్ లో ఫిట్ నెస్ కోసం
వివాదాలకు దూరంగా ఉండే గౌతమ్ రెడ్డి అటు రాజకీయాల్లోనూ..ఇటు తమ బిజినెస్ వ్యవహారాల్లోనూ కీలకంగా సమర్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని గౌతమ్ ఈ విధంగా గుండెపోటుకు గురయ్యారనే వార్త తో వైసీపీలో ఒక్క సారిగా టెన్షన్ మొదలైంది. గతంలో రెండు సార్లు గౌతమ్ రెడ్డి కరోనాకు గురయ్యారు. గౌతమ్ ఒక జిమ్ అడ్వయిజర్ సమక్షంలోనే నిత్యం జిమ్ చేస్తారు. ఆరోగ్యంగానే ఉండే మంత్రి సడన్ గా గుండె పోటుకు గురయ్యారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందించినా ఫలితం కనిపించ లేదు. ఇప్పుడు ఆయన మరణ వార్త విని ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications