జూనియర్ ఎన్టీఆర్‌కు ఫోన్ చేసిన నారా లోకేష్
ఏపీ, తెలంగాణను వరదలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంలో ఉధృతంగా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వదర ఒక్కసారిగా విజయవాడను ముంచేసింది. దీనికి ప్రధాన కారణం బుడమేరు. బుడమేరు డ్రెయిన్ బఫర్ జోన్ లో అన్నీ అక్రమ కట్టడాలే కావడంతోపాటు బుడమేరు ఆధునికకరణ ప్రతిపాదనను గత ప్రభుత్వం పక్కన పడేసింది. చివరకు విజయవాడ నగరాన్ని ముంచేసింది. అలాగే ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. నగరం మొత్తం నీటమునిగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
ముందుగా స్పందించిన తారక్
ఇటువంటి తరుణంలో ముందుగా సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటిరూపాయల విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పంపించారు. దీనిపై వివిధరంగాల్లోని ప్రముఖులంతా తారక్ పై ప్రశంసలు కురిపించారు. ఆపత్కాలం సంభవించిన సత్వరమే స్పందించిన ఎన్టీఆర్ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలిచారు. మిగతా హీరోలు కూడా వరుసగా రెండు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేసి విరాళం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తారక్ కు ధన్యవాదాలు తెలిపిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ధన్యావాదాలు తెలియజేశారు. తారక్ తోపాటు విశ్వక్ సేన్ కు కూడా రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఒకరు ఒకఅడుగు ముందుకు వస్తే మిగతా అందరికీ అది స్ఫూర్తివంతంగా నిలుస్తుందని, అందరూ ఆ బాటలో నడుస్తారని, అటువంటిదాన్ని జూనియర్ ఎన్టీఆర్ సాధ్యంచేసి చూపించారని రేవంత్ కొనియాడారు. తారక్ తోపాటు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అనన్య నాగళ్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్, సూర్యదేవర నాగవంశీ, చినబాబు, వెంకీ అట్లూరి, సి.అశ్వనీదత్.. తదితర ప్రముఖులంతా విరాళాలను ప్రకటించారు.












Click it and Unblock the Notifications