Nara Lokesh: అధికారుల తప్పుకు సారీ చెప్పిన నారా లోకేష్..!
ఏపీలో ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కీలకంగా మారిన మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో పనిచేస్తూ, చేయిస్తూ కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో దాదాపుగా నంబర్ టూగా ఉన్న నారా లోకేష్.. చిన్న చిన్న అంశాల విషయంలోనూ చురుగ్గా స్పందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అంతే కాదు తనవైపు నుంచి తప్పుంటే ఎలాంటి భేషజాలు లేకుండా దాన్ని అంగీకరించేందుకు సైతం సిద్దంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఎదుటివారికి క్షమాపణలు చెప్పేందుకూ సిద్దమవుతున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఏపీలో మురుగునీటి సమస్యపై ప్రజాదర్బార్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీన్ని లోకేష్ సదరు శాఖకు పంపారు. అయితే సమస్య పరిష్కారం కాకుండానే అయినట్లు అధికారులు ఫిర్యాదు దారుకు మెసేజ్ పంపేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు ఫిర్యాదుదారు తిరిగి లోకేష్ కు ఎక్స్ లో ఈ విషయం తెలిపారు. ఫిర్యాదు చేస్తే పరిష్కారం కాకుండానే అయినట్లు అధికారులు మెసేజ్ పంపినట్లు లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

Dear @RISHIK25941244, please accept my apologies on behalf of the dept. My team will have a word with the concerned authorities and resolve this issue at the earliest. I will keep you posted! https://t.co/YDDGrsSQxu
— Lokesh Nara (@naralokesh) August 17, 2024
దీనికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తన ప్రభుత్వంలో సదరు శాఖ తరఫున లోకేష్ ఫిర్యాదు దారుకు క్షమాపణలు చెప్పారు. త్వరలోనే తన టీమ్ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి వేగంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.తద్వారా తనవైపు నుంచి తప్పు జరిగిందని అంగీకరించడమే కాకుండా పరిష్కారం చేస్తానని కూడా హామీ ఇవ్వడంతో లోకేష్ మరో మెట్టు పైకి ఎదిగినట్లయింది. గతంలోనూ తమ ప్రభుత్వంలో ముందస్తు నిర్బంధాలు, హౌస్ అరెస్టులు ఉండవని చెప్పాక కూడా పోలీసులు అత్యుత్సాహంతో కమ్యూనిస్టు నేతలను అరెస్టు చేసినప్పుడు కూడా లోకేష్ ఇలాగే వారిని క్షమాపణలు కోరారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ











Click it and Unblock the Notifications