మానవత్వం చాటుకున్న మంత్రి లోకేష్..

ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఓ వైపు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెడుతూనే.. మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను మెరుపు వేగంతో పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అవయవ దానం గురించి మంత్రి లోకేష్‌కు గుంటూరులోని రమేష్ ఆస్పత్రి వైద్యులు, సంబంధిత కుటుంబ సభ్యులు మెసేజ్‌ చేశారు. దీంతో వెంటనే లోకేష్ రంగంలోకి దిగారు. హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. ఆయన స్పందించడంతో ఇద్దరి ప్రాణాలు సేవ్ అయ్యాయి.

AP Minister Nara Lokesh Responds to Heart Transplant Crisis Organizes Special Plane

ఏం జరిగింది.. ?

గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిడ్ డెడ్ కు గురి అయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురి అయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో సుష్మ కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. ఆమె అవయవదానంతో తిరుపతిలో మరొకరికి ప్రాణదానం జరుగనుంది. సుష్మ గుండెనే తిరుపతిలోని మరొకరికి అమర్చనున్నారు.

అయితే.. ఈ సమయంలోనే మంత్రి లోకేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. గుంటూరు నుంచి తిరుపతికి గుండెను తరలించడానికి సొంత ఖర్చులతో లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానెల్ ద్వారా గుండెను గుంటూరు రమేష్ ఆస్పత్రి నుంచి తిరుపతికి తరలించనున్నారు. దీంతో గుండె మార్పిడి విజయవంతం చేయడానికి వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సకాలంలో స్పందించిన మంత్రి నారా లోకేష్ కు సుష్మ కుటుంబ సభ్యులు, రమేశ్ హాస్పిటల్స్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+