Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ప్రజలకు ఉగాది కానుక.. వారికి ఏకంగా లక్ష ఇళ్ళు!

ఏపీ ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. ఉగాది పండుగ కానుకగా ఇల్లు లేని నిరుపేదలకు బహుమతి ఇవ్వడానికి రెడీ అయింది. ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లను అందజేయనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 2026 జూన్ నాటికి రాష్ట్రంలో మొత్తం టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడిన టిడ్కో ఇళ్ల లబ్దిదారులు

మున్సిపల్ శాఖకు సంబంధించి బడ్జెట్ డిమాండ్ల పైన అసెంబ్లీ జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, వాటిని గత వైసీపీ ప్రభుత్వం 2.65 లక్షలకు కుదించి రంగులు మార్చిందని ఆరోపించారు. నిర్మాణాలు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించాలని, దీంతో నిజమైన లబ్ధిదారులు చాలా చోట్ల ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు.

AP Minister Narayana Announces Distribution of 1 Lakh TIDCO Houses for Ugadi good news to ap people

ఉగాది నాటికి లక్షటిడ్కో ఇళ్ళు సిద్ధంగా

ప్రస్తుతం హడ్కో నుండి 4,450 కోట్ల రూపాయల రుణం మంజూరు అయిందని, ఈ సంవత్సరం ఉగాది నాటికి లక్షటిడ్కో ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పట్టణ జనాభా 36శాతంగా ఉందని పేర్కొన్న ఆయన, 2047 నాటికి 60శాతానికి చేరుతుందని అంచనా వేశారు. ఈ పెరుగుదలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన అన్నారు.

ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల నిజం చేసే ప్లాన్

అంతేకాదు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు బడ్జెట్లో 14,538.68 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపిన మంత్రి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన ఉగాది సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో పేదల కోసం లక్ష టిడ్కో గృహాలను ప్రభుత్వం అందజేస్తుందని, ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ వెల్లడించారు.

ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్!
ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్!

పన్నుల రూపంలో వచ్చిన 3500 కోట్ల దారి మళ్లింపు

నగరాలు, పట్టణాలలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సరళతరం చేసినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలకు పన్నుల రూపంలో వచ్చిన 3500 కోట్లను దారి మళ్లించారని మంత్రి నారాయణ ఆరోపించారు. గతంలో జరిగిన టిడిఆర్ బాండ్ల కుంభకోణం పైన విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల ద్వారా వచ్చిన నిధులను సంబంధిత మున్సిపాలిటీలలోనే ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+