పవన్ పై రోజా సెటైర్లు-ఎమ్మెల్యేగా గెలిచి మాట్లాడు-చంద్రబాబుకు త్యాగాలు అవసరమా ?
ఏపీలో పొత్తుల కోసం విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు అధికార వైసీపీలో కాక రేపుతున్నాయి. లేదు లేదంటూనే విపక్షాల్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ.. ఒంటరి పోరుకు వారిని ఆహ్వానిస్తోంది. పొత్తుల కోసం చంద్రబాబు, పవన్ చేస్తున్న ప్రయత్నాలపై ఇవాళ మంత్రి ఆర్కేరోజా మచిలీపట్నం టూర్ లో సెటైర్లు వేశారు.
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. జగన్ సుపరిపాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్ కో విషం కక్కుతోందని ఆమె ఆరోపించారు.
తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పచ్చ ఛానల్స్ లో ప్రతికూలంగా చూపిస్తోందని విమర్శించారు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా అధికార దాహంతో సీఎం కుర్చీలో కూర్చోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నాడంటూ రోజా విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి త్యాగాలు చేయాలా అని ఆమె ప్రశ్నించారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడంటూ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని, ఆయన అభిమానుల్ని చూస్తుంటే జాలేస్తోందని రోజా వ్యాఖ్యానించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని పడగొడతాడంట అంటూ రోజా ఆక్షేపించారు. ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ కు సవాల్ విసిరితే బాగుంటుందని పవన్ కు రోజా సూచించారు. చంద్రబాబు & కోకు పవర్ తప్ప ప్రజల అవసరం లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రోజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications