RK Roja : జగన్ ను వ్యతిరేకిస్తే వారికే నష్టం-ఆయనకేం నష్టం లేదు-వెన్నుపోటు ఎమ్మెల్యేలపై రోజా..
అమరావతి : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాలు అధికార వైసీపీకి భారీ షాకిచ్చాయి. విపక్ష టీడీపీ ఎత్తుల్ని ముందుగానే గ్రహించి అప్రమత్తమైనా..తాము నిలబెట్టిన అభ్యర్ధులందరినీ గెలిపించుకోవడంలో జగన్ విఫలమయ్యారు. దీంతో ఇప్పుడు జగన్ కు వెన్నుపోటు పొడిచిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కు వెన్నుపోటు పొడిచిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలపై పర్యాటకమంత్రి ఆర్కే రోజా స్పందించారు. సొంత ఎమ్మెల్యేల వెన్నుపోటుపై స్పందించిన రోజా.. జగన్ ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టమన్నారు. జగన్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. జగన్ తన సొంత జెండా, అజెండాతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలు వీరని రోజా తెలిపారు. తద్వారా జగన్ కావాలనుకుంటే మళ్లీ వీరి స్ధానాల్లో ఇంకొకరిని నిలబెట్టి గెలిపించుకోగలమని చెప్పేశారు.

మరోవైపు చంద్రబాబు వైసీపీ నుంచి లాక్కున్న నలుగురు ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని చేసినప్పుడు కూడా తాము అభ్యంతరాలు వ్యక్తం చేశామని రోజా తెలిపారు. వైశ్రాయ్ లో మొదలుపెట్టిన వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని రోజా ఆరోపించారు. ప్రజలంతా ఈ వెన్నుపోటు రాజకీయాల్ని తిప్పికొట్టాలన్నారు. అప్పుడు ఎన్టీఆర్ నుంచిఎమ్మెల్యేల్ని లాక్కున్నారన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిపై అవిశ్వాసం పెడితే ఎమ్మెల్యేల్ని కొనుక్కున్నారని రోజా విమర్శించారు.
ఆ తర్వాత వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల్ని కొని నలుగురిని మంత్రుల్ని చేశారన్నారు. ఇప్పుడూ అదే చేశారన్నారు.
జగన్ ను వ్యతిరేకిస్తే వారికే నష్టం.. ఆయనకేం నష్టం లేదు.. వెన్నుపోటు ఎమ్మెల్యేలపై రోజా..!!#RKRoja #MLARoja #YSJagan #CMjagan #ApMLCElections2023 #MLCElectionsInAP #MLCElectionsResults #Oneindiatelugu pic.twitter.com/JT0bVUPcKy
— oneindiatelugu (@oneindiatelugu) March 24, 2023












Click it and Unblock the Notifications