జగన్ పుట్టినరోజున శాంతాక్లాజ్ గా ఆర్కే రోజా ! విజయవాడలో పేద కుటుంబానికి సర్ ప్రైజ్ గిఫ్ట్స్..
ఏపీలో విపక్షాలపై తనదైన శైలిలో మాటల దాడి చేసే మహిళా మంత్రి ఆర్కే రోజా ఇవాళ ఒక్కసారిగా రూటు మార్చారు. తన శైలికి భిన్నంగా విజయవాడ వాంబే కాలనీలో ప్రత్యక్ష మయ్యారు. అదీ క్రిస్మస్ తాత శాంతా క్లాజ్ వేషంలో. సడన్ గా వాంబే కాలనీకి కారులో వచ్చిన శాంతా క్లాజ్ ను చూసి అక్కడి కాలనీ వాసులు అవాక్కయ్యారు. చేతినిండా బహుమతులతో నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో వచ్చారని ఆశ్చర్యపోయారు. అంతలోనే ఓ పేద కుటుంబం ఇంట్లోకి వెళ్లి అక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడంతో వచ్చింది రోజా అని తెలిసి సంబరపడ్డారు.
విజయవాడ వాంబే కాలని లో నివాసముండే నాగరాజు రోడ్డు మీద చెప్పులు అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు, నాగరాజుకి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాగరాజు భార్యకి తీవ్ర అనారోగ్యం సోకి కిడ్నీ తొలగించారు. దీంతో దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చు అయిపోయింది. దీంతో పాటు నాగరాజుకి కూడా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న పింఛనుతో ఇల్లు గడుపుకుంటూ ఇక చివరి ప్రయత్నంగా మంత్రి రోజాను ఆదుకోవాలని కోరాడు. ఈ వీడియో కాస్తా మంత్రి రోజాకు చేరడంతో ఆమె చలించిపోయారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజున మంత్రి ఆర్కే రోజా.. నాగరాజు ఇంటికి క్రిస్మస్ తాత గా మారి నాగరాజు పిల్లలకి చాక్లెట్లు బిస్కేట్స్ కేక్ తీసుకెళ్ళారు. నాగరాజు తలుపు తట్టి సర్ప్రైజ్ చేశారు. దీంతో ఆ అభాగ్యుడి ఇంట్లో పడుగ వాతావరణం వచ్చేసింది. సిఎం జగన్ పుట్టిన రోజు ఆ కుటుంబం తో కలిసి జరుపుకున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తన వంతుగా వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించమని హామీ ఇచ్చారు.


నాగరాజు నిజజీవిత కథ తనను ఎంతగానో కదిలించిందని, తన తండ్రి పేరు కూడా నాగరాజే అని రోజా తెలిపారు. చివరికి నాగరాజు తన పిల్లను కాపాడుకోవాలని పడుతున్న తపన కంట తడిపుట్టించిందని, నాన్న ఆవేదన తనకు బాగా తెలుసన్నారు. అందుకే తన అన్న జగన్ పుట్టిన రోజున ఆ కుటుంబానికి అక్కగా మారాలనుకున్నట్లు రోజా తెలిపారు.













Click it and Unblock the Notifications