మాపై కెసిఆర్ పెత్తనమేంటి!: బాబు, అందుకే జగన్ ఆరేళ్లుగా ఓదార్పు

హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి రాజధాని వచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన శాసన మండలిలో మాట్లాడారు. టి సర్కారుకు మా పైన పెత్తనం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. వారికి ఆ అధికారం ఎక్కడిదన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య అనాలోచిత తీరు వల్లే సమస్యలు అని అభిప్రాయపడ్డారు. ఏపీకి చాలా సమస్యలు ఉన్నాయని, కేంద్రం సహకరించాలన్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు. కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలన్నారు.

AP Minister satire on YS Jagan's odarpu

శాసన సభలో జగన్ వర్సెస్ అచ్చెన్నాయుడు

శాసన సభలో కరువు విషయమై గురువారం సాయంత్రం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసిపి అధ్యక్షులు జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో 196 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

రైతులు అపరాధ రుసుము కట్టవలసి వస్తోందన్నారు. రైతులు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పారు.
రైతులు రుణాలు కూడా తీసుకోలేని పరిస్థితిని ప్రభుత్వం తెచ్చిందన్నారు.

మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కౌంటర్

మంత్రి పల్లె మాట్లాడుతూ.. వైయస్ హయాంలో 24వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మేం రుణమాఫీ చేయడంతో రైతులు హాయిగా ఉన్నారన్నారు. జగన్ అవాస్తవాలు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఓదార్పు యాత్రపై అచ్చెన్నాయుడు

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... జగన్‌కు ప్రతి విషయంలో ఖాతాలు తెరవడం అలవాటు అన్నారు. వైయస్ చనిపోయినప్పుడు... ఆ తర్వాత ఎవరు చనిపోయినా వైయస్ ఖాతాలో వేయాలని ఆయన ఖాతా తెరిచారని ఎద్దేవా చేశారు. అందుకే ఆరేళ్లుగా ఓదార్పు యాత్ర చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+