Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్యేల జీతాల పెంపు, ఎవరికెంత?: నిన్న తెలంగాణ, ఈరోజు ఏపీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీ ఎత్తున జీతాలు పెరగనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల భత్యాల పెంపుపై సౌకర్యాల కమిటీ నివేదికను శాసనసభలో బుధవారం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జీతాల పెంపు నివేదికను అసెంబ్లీ ఆమోదించనుంది.

పెరిగిన జీతాల ప్రకారం ఇప్పటి వరకు రూ. 95 వేలుగా ఉన్న ఎమ్మెల్యేల జీతాన్ని రూ. 1 లక్షా 50 వేలకు పెంచాలని, ఇంటి అద్దెను రూ. 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల పెన్షన్‌ను రూ. 25 నుంచి రూ. 50 వేలకు పెంచనున్నారు.

AP MLA's and MLC's salary increased

ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫించన్ సైతం 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. రైల్వే చార్జీల నిమిత్తం రూ. లక్ష, పుస్తకాల కొనుగోలు కింద ఐదు సంవత్సరాలకు గాను రూ. లక్ష ఇవ్వాలని నివేదికలో ప్రతిపాదించారు. దీంతో పాటు వాహన‌ లోన్ సదుపాయాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచాలని కమిటీ ప్రతిపాదించింది.

ఇప్పటికే రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంటే, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల జీతాల పెంపు మరింత భారం అవుతుందని విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కాగా పోరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా మంగళవారం ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల జీతభత్యాల బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతాలు ఇలా:

దీంతో తెలంగాణలో ఎమ్మెల్యేలకు సరాసరిగా రూ. 2.30 లక్షల వరకు జీతభత్యాలు పెరిగాయి. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బిల్లును సభలో ప్రవేశపెట్టగా, అన్ని పక్షాల మద్దతుతో బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

జీతాల పెంపు సందర్భంగా జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ ''ఎమ్మెల్యేలకు కూడా ఆర్థిక కష్టాలు ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వారి జీతాలను పెంచాలని నిర్ణయించాం. దీనిని మరో విధంగా చూడవద్దు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి'' అని అన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను ఒక్కసారిగా రూ.95 వేల నుంచి రూ.2.5 లక్షలకు (163%) పెంచేందుకు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఉన్న జీతభత్యాల కంటే 72%.. శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్లకు 70%.. మంత్రులు, చీఫ్‌ విప్‌, విప్‌లకు 65% మేర పెరగనున్నాయి.

AP MLA's and MLC's salary increased

మాజీ ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు ప్రస్తుతం కనిష్ఠంగా రూ.15 వేలు, గరిష్ఠంగా రూ.25 వేలు చొప్పున ఇస్తున్నారు. దీనిని కనిష్ఠ పింఛను రూ.30 వేలకు, గరిష్ఠ పింఛను రూ.50 వేలు చేయాలని ప్రతిపాదించారు. ఒకసారి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా పనిచేసిన వారికి రూ.30 వేలు, రెండుసార్లు గెలిచి మాజీ అయితే రూ.35 వేలు, మూడుసార్లు పనిచేసిన వారికి రూ.40 వేలు, నాలుగుసార్లు పనిచేసిన వారికి రూ.45 వేలు, ఐదుసార్లు ఎన్నికైన మాజీలకు రూ.50 వేలు చొప్పున పెన్షన్‌ చెల్లించనున్నారు.

మాజీ చట్టసభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి భార్య/భర్తకు కూడా ఇకపై అంతే మొత్తాన్ని పెన్షన్‌గా అందించనున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మరణిస్తే పెన్షన్‌లో సగం మాత్రమే వారి భార్య/భర్తకు ఇచ్చేవారు. తాజా ప్రతిపాదనతో వారికి పూర్తి పింఛను అందుతుంది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీల ఆరోగ్య బీమా పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో ఇవ్వనుంది. వాహన రుణ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచనుంది.

జీతం, అలవెన్సులు కలిపి ముఖ్యమంత్రి జీతం రూ.4.21 లక్షలు, స్పీకర్, మండలి చైర్మన్‌కు రూ.4.11 లక్షలు, మంత్రులకు, చీఫ్ విప్, విప్‌లకు రూ.4 లక్షలు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రూ.2.5 లక్షలు రానున్నాయి. జీతాల పెంపు ద్వారా ప్రభుత్వంపై అదనంగా రూ. 42 కోట్లు భారం పడనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+