ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా? పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఒత్తిడి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఒత్తిడి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సమయంలో తమ పార్టీ నుండి అభ్యర్థులను బరిలోకి దించే పరిస్థితి లేకున్నప్పటికీ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయడమేనని అర్థమవుతుంది.

ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా, ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 27వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 13వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో .. ఎవరికి వారే వ్యూహాత్మకంగా
ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసిపి అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే, అటు బిజెపి, ఇటు టిడిపి సైతం ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు వైసిపి ఖాతాలోనే పడే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పవన్ పై విపరీతంగా ఒత్తిడి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుండి, తమ సిట్టింగ్ స్థానం కోసం మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాధవ్ ను బరిలోకి దించుతున్నట్టు ప్రకటించింది.

పవన్ మద్దతు కోసం బీజేపీ, టీడీపీలు
ప్రస్తుతం బిజెపి పొత్తుతో ఉన్న జనసేనకు ఉత్తరాంధ్రలో పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి బిజెపి అభ్యర్థి బరిలో ఉండడంతో, ఆయనకు మద్దతు ఇవ్వాలని బిజెపి ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ ను కోరుతున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు టిడిపితో పొత్తుకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ సానుకూల వైఖరితో తమకు మద్దతు ఇస్తే బాగుంటుందని టిడిపి శ్రేణులు కూడా కోరుతున్నారు. దీంతో ఇక్కడ కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు పరిస్థితి తయారైంది.

డోలాయమానంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి
బిజెపికి మద్దతిస్తే టిడిపి నుండి, టిడిపికి మద్దతు ఇస్తే బిజెపి నుండి పవన్ కళ్యాణ్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావన కనిపిస్తుంది. దీంతో అసలు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండానే జనసేన అధినేత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం. ఎవరికి మద్దతు తెలిపాలో అర్థం కాని డోలాయమాన పరిస్థితిలో జనసేన ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల మద్దతుపై నోరు మెదపలేదు.

ఆ గట్టునుంటారా? ఈ గట్టుకొస్తారా?
పవన్ కళ్యాణ్ బయటకు బహిరంగంగా ప్రకటన చేయకపోయినా అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే బాగుండు అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. బిజెపితో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ బిజెపికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మరోమారు తమ బంధాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చెప్పాలని బిజెపి ఎదురుచూస్తుంది. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఆ గట్టునుంటారా? ఈ గట్టుకు వెళతారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications