ఏపీ తహసీల్దార్ దారుణ హత్యకు ముందు భార్యకు కీలకఫైలు.. అందులో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహసీల్దార్ హత్య కేసులో కీలక మలుపులు చేసుకుంటున్నాయి. తహసిల్దార్ రమణయ్య హత్య కేసులో మధురవాడ లోని జెవెల్ పార్క్ భూవివాదం కారణమని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ నగరాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇనుప రాడ్ తో కొట్టి రమణయ్యను హతమార్చిన కేసులో కీలక నిందితుడు పరారీ కాగా ప్రస్తుతం నిందితుడు చెన్నైలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు చెన్నైకి ప్రత్యేక బృందాన్ని పంపించారు. ప్రస్తుతం నిందితుడు చెన్నైలో ఎగ్మోర్ స్టేషన్ లో ఉన్నట్టుగా సమాచారం. హత్య జరిగిన మరుసటి రోజు 12 గంటల వరకు నిందితుడు విశాఖలోనే ఉన్నట్టు ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి పారిపోయినట్లు తెలుస్తోంది.

తహసిల్దార్ రమణయ్య హత్యకేసు నిందితుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు గుర్తించలేకపోవడం పై సి పి రవిశంకర్ పోలీస్ అధికారులను తీవ్రంగా మండిపడ్డారు. నిందితుడిని పట్టుకోవడంలో జరిగిన వైఫల్యంపై జాయింట్ సీపీ ఆధ్వర్యంలో విచారణకు కూడా ఆదేశించారు. అయితే హత్యకు కొన్ని నిమిషాల ముందు భార్యకు తహసిల్దార్ రమణయ్య ఒక కీలక ఫైలును జాగ్రత్తగా ఉంచమని చెప్పినట్టు విచారణలో తేలింది.
అయితే ఆ ఫైల్ లో ఏముంది? ఆ ఫైలు మధురవాడ జెవెల్ పార్క్ భూ వివాదానికి సంబంధించిన ఫైలునా? అన్నది తెలియాల్సి ఉంది. మధురవాడ లోని జెవెల్ పార్క్ ప్లాట్లు ఉన్న స్థలానికి సంబంధించి కన్వేయన్స్ డీడ్ జారీ కోసం రియల్ ఎస్టేట్ దళారీ అయిన విజయవాడకు చెందిన మురారి సుబ్రమణ్యం గంగారావు అలియాస్ గంగాధర్ ఎమ్మార్వో రమణయ్య కు 57 లక్షల రూపాయల వరకు ఇచ్చినట్లు సమాచారం.
ఇక రమణయ్య విశాఖ రూరల్ నుంచి ఇటీవల విజయనగరం జిల్లాకు బదిలీ కావడంతో పాత తేదీలతో సంతకాలు పెట్టేందుకు వారు రమణయ్య పై ఒత్తిడి తెచ్చారని, తిరస్కరించడంతోనే కక్ష కట్టి హత్య చేసినట్టు.. ఆ దిశలో కూడా ఈ కేసులో విచారణ జరుగుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications