మున్సిపల్ ఎన్నికల తాజా షెడ్యూల్- 4 చోట్ల నామినేషన్లు- పోలింగ్, రిజల్ట్స్ ఇలా..!

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్ని (AP Municipal Elections) రీషెడ్యూల్ చేస్తూ ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు నాలుగు చోట్ల 48 గంటల గడువు పొడిగింపు ఇచ్చారు. ఇది రేపు, ఎల్లుండి అమల్లో ఉండనుంది. అలాగే కొత్త పోలింగ్, కౌంటింగ్ తేదీల్ని కూడా ప్రకటించారు. దీంతో రేపటి నుంచి తిరిగి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి అందిన నివేదిక నేపథ్యంలో ఎస్ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

నామినేషన్లకు ప్రకటించిన కొత్త షెడ్యూల్

- నామినేషన్ల దాఖలు: అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
- కొత్త నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 25న ఉదయం 8 గంటల నుంచి.
- కొత్తగా నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఉపసంహరణకు చివరి గడువు: అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటల వరకు.
- పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా: అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటల తర్వాత.
- పోలింగ్: నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
- రీపోలింగ్ (అవసరమైతే): నవంబర్ 2న.
- ఓట్ల లెక్కింపు: నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి.

AP Municipal Elections Rescheduled Polling on November 1 Counting on November 3 extends nominations

అలాగే నామినేషన్ల గడువు పొడిగించిన నాలుగు పట్టణ స్థానిక సంస్థలు

1. కడప మున్సిపల్ కార్పొరేషన్: 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55 వార్డులు.

2. రాజంపేట మున్సిపాలిటీ: 6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27 వార్డులు.

3. మైదుకూరు మున్సిపాలిటీ: మొత్తం 32 వార్డులు.

4. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్: 1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66 వార్డులు.

నామినేషన్ల దాఖలు సమయంలో కొందరు అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, నామినేషన్ పత్రాల చింపివేత వంటి ఘటనలను ఎదుర్కొన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. మరికొన్ని పరిస్థితుల కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీల నుంచి వచ్చిన నివేదికలు, అభ్యర్థుల ఫిర్యాదులు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్లకు అదనపు అవకాశం కల్పించింది. ఇప్పటికే నోటిఫై చేసిన నామినేషన్ కేంద్రాలతో పాటు సంబంధిత కలెక్టర్లు సూచించిన కలెక్టరేట్ ప్రాంగణాల్లోనూ నామినేషన్లను స్వీకరిస్తారు. అలాగే మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ నుంచి ఎన్నికల షెడ్యూల్‌ను సవరించింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ సవరించిన షెడ్యూల్ పరిధిలో ఉంటుంది. పరోక్ష ఎన్నికల షెడ్యూల్‌ను విడిగా ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+