జ‌గ‌న్ టీం 25 : నేడే మంత్రుల ప్ర‌మాణ స్వీకారం: స‌ర్వం సిద్దం..భారీ వ‌ర్షం..!

Recommended Video

    నేడే మంత్రుల ప్ర‌మాణ స్వీకారం : స‌ర్వం సిద్దం.. భారీ వ‌ర్షం..! || Oneindia Telugu

    ఏపీలో నూత‌న మంత్రుల ప్ర‌మాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ ఉద‌యం 11.49 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కొత్త మంత్రుల‌తో ప్రమాణ స్వీకారం చేయించ‌నున్నారు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న కేబినెట్ మంత్రుల జాబితా గ‌వ‌ర్న‌ర్ అంద‌చేసారు. ఆ త‌రువాత సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ నుండి మంత్రుల‌కు అధికారికంగా స‌మాచారం అందించారు. సచివాల‌యం స‌మీపంలోనే 25 మంది మంత్రులు ఒకేసారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు ఇదే స‌మ‌యంలో ప్రమాణ స్వీకార ప్రాంగ‌ణం వ‌ద్ద భారీ వ‌ర్షం ప‌డుతోంది. కోసం వారి అభిమానులు ఇప్ప‌టికే ప్రాంగ‌ణానికి చేరుకుంటున్నారు.

    11.49 గంట‌ల‌కు..25 మందితో

    11.49 గంట‌ల‌కు..25 మందితో

    రాష్ట్ర నూత‌న మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం కోసం వెల‌గ‌పూడి స‌చివాల‌యం స‌మీపంలో అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఉద‌యం 11.45 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ ప్రాంగ‌ణానికి చేరుకుంటారు. ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వాగ‌తం ప‌లుకుతారు. స‌రిగ్గా 11.49 గంట‌ల‌కు మంత్రులతో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు. సాధార‌ణ ప‌రిపాల‌నా అధికా రుల‌తో పాటుగా పార్టీ నేత‌లు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. కార్య‌క్ర‌మానికి వ‌చ్చే అతిధుల కోసం ప్రొటోకాల్ విభాగం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించేందుకు వీలుగా ప్రాంగణంలో ఎల్‌ఇడి తెరలను ఏర్పాటుచేశారు. 1500 మంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటుచేసింది. సచివాలయం వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఆహ్వాన పత్రికలకు వెనుక భాగాన రూట్‌ మ్యాప్‌ను కూడా ముద్రించారు. ఇక‌, ఈ ప్రాంగ‌ణంలో ప్ర‌స్తుతం భారీ వ‌ర్షం కురుస్తోంది.

    ప్ర‌మాణ స్వీకారం చేసే మంత్రులు వీరే..

    ప్ర‌మాణ స్వీకారం చేసే మంత్రులు వీరే..

    1. ధర్మాన కృష్ణదాస్‌ (పోలినాటి వెలమ-బీసీ)- శ్రీకాకుళం
    2. బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు-బీసీ)- విజయనగరం
    3. పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ)- విజయనగరం
    4. అవంతి శ్రీనివాస్‌ (కాపు)-విశాఖపట్నం
    5. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (శెట్టిబలిజ-బీసీ)- తూర్పు గోదావరి
    6. కురసాల కన్నబాబు (కాపు)- తూర్పు గోదావరి
    7. పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ-మాల)- తూర్పు గోదావరి
    8. ఆళ్ల నాని (కాపు)- పశ్చిమ గోదావరి
    9. తానేటి వనిత (ఎస్సీ-మాదిగ)- పశ్చిమ గోదావరి
    10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు(క్షత్రియ- పశ్చిమ గోదావరి
    11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (వైశ్య)- కృష్ణా
    12. కొడాలి నాని (కమ్మ)- కృష్ణా
    13. పేర్ని నాని (కాపు)- కృష్ణా
    14. మేకతోటి సుచరిత (ఎస్సీ-మాల)- గుంటూరు
    15. మోపిదేవి వెంకటరమణారావు (మత్స్యకారుడు-బీసీ)- గుంటూరు
    16.బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి)- ప్రకాశం
    17. ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ-మాదిగ)- ప్రకాశం
    18.పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ (యాదవ-బీసీ)- పీఎస్సార్‌ నెల్లూరు
    19. మేకపాటి గౌతమ్‌రెడ్డి (రెడ్డి)- పీఎస్సార్‌ నెల్లూరు
    20. షేక్‌ బేపారి అంజాద్‌ బాషా(ముస్లిం-బీసీ)- వైఎస్సార్‌ జిల్లా
    21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి)- చిత్తూరు
    22. కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ-మాల)- చిత్తూరు
    23. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి)- కర్నూలు
    24. గుమ్మనూరు జయరామ్‌ (బోయ-బీసీ)- కర్నూలు
    25. మాలగుండ్ల శంకరనారాయణ (కురుబ-బీసీ)- అనంతపురం

    జ‌గ‌న్‌తో కొత్త మంత్రుల భేటీ...

    జ‌గ‌న్‌తో కొత్త మంత్రుల భేటీ...

    ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ముగిసిన త‌రువాత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో కొత్త మంత్రులు మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ కానున్నారు. ఈ సంద‌ర్బంగా వారికి జ‌గ‌న్ దిశా నిర్ధేశం చేయ‌నున్నారు. సామాజిక -ప్రాంతీయ స‌మీకార‌ణాల్లో భాగంగానే తాను కొంతమందికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేక పోయాన‌ని..వారికి ఖ‌చ్చితంగా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని జ‌గ‌న్ మ‌రోసారి వివ‌రించే అవ‌కాశం ఉంది. అదే విధంగా జ‌గ‌న్ త‌న టీం నుండి ఏ విధ‌మైన ప‌ని తీరు..ఫ‌లితాలు ఆశిస్తుందీ వివ‌రించ నున్నారు. కొత్త కేబినెట్‌లో ఆరుగురు మిన‌హా మిగిలిన వారికి గ‌తంలో మంత్రులుగా ప‌ని చేసిన అనుభ‌వం లేదు. దీంతో..వారికి ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ సూచ‌న‌లు చేసే అవ‌కాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+