జగన్ పర్యటనలో నిర్లక్ష్యం: బుల్లెట్ ప్రూఫ్ వాహనం తాళాలు మర్చిపోయారు!

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్టెట్ ప్రూఫ్ వాహనంలో తాళాలు మరిచిపోయిన ప్రభుత్వ సిబ్బంది.. ఆ వాహనం డోర్‌ను లాక్ చేశారు.

దీంతో మరో వాహనం కోసం శ్రీకాకుళం ఎస్పీకి సమాచారం ఇచ్చారు. కానీ, అక్కడ్నుంచి వాహన రావడానికి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది కొంత హైరానా పడ్డారు. కాగా, ఇది ప్రొటోకాల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వైసీపీ నేతలు ఆరోపించారు.

ap officials careless in ys jaganmohan reddy srikakulam tour

అయితే, వేరే వాహనం వచ్చేలోగా వైయస్ జగన్ వస్తే పరిస్థితి ఏంటని పోలీసులు, ప్రొటోకాల్ అధికారులు ఆందోళన చెందారు. విశాఖ పోలీస్ కమిషనర్‌కు కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఈలోగా ప్రత్యామ్నాయంగా వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రైవేటు వాహనం ఏర్పాటు చేస్తుండగా.. విశాఖ కమిషనర్ వేరే వాహనాన్ని పంపారు.

ఇది ఇలా ఉండగా, శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరిన వైయస్ జగన్.. శుక్రవారం ఉదయం విశాఖ విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడ్నుంచి ఆయన రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుంటారు. పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh officials carelessly behaved in YSR Congress Party president YS Jaganmohan Reddy Srikakulam tour.
Please Wait while comments are loading...