మంత్రులంటే వారికి ‘లైట్’: ఏపీలో ముదురుతున్న ప్రొటోకాల్ వివాదం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ /అమరావతి: ఆంధ్రప్రదేశ్ అధికారుల ద్రుష్టిలో తమ మంత్రులంటే లెక్క లేనట్లు కనిపిస్తోంది. 'అయితే మాకేంటి' అన్న రీతిలో మంత్రులను అధికారులు అవమానిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్‌ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తాజా పరిణామాలు చెప్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధిత హోంశాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం
చినరాజప్పకు తపాల్‌లో ఆహ్వానం పంపడమే దీనికి నిదర్శనం. గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటాకూ అదే అనుభవం ఎదురైంది.

రాజీనామాకు సిద్ధపడిన చిన రాజప్ప

ఇతర మంత్రులు మాణిక్యాల రావు, భూమా అఖిలప్రియ అంటే వారికి లెక్కే లేకుండా పోయిందన్న విమర్శలు తరుచుగా వినిపిస్తున్నాయి. నిమ్మకాయల చిన రాజప్ప ఉదంతం వెలుగులోకి వచ్చాక సీఎం కార్యాలయం దీనిపై ద్రుష్టి సారించినట్లు సమాచారం. సహజంగా ఏపీ సీఎం చంద్రబాబు 'అందరూ ఉన్నారు కదా! మీరు దూరంగా ఉన్నారెందుకు! ఇలా దగ్గరికి రండి' ప్రభుత్వ కార్యాలయాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సమయంలో ఒకసారి చుట్టూ పరిశీలిస్తారు.

మరీ ముఖ్యంగా... సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులు తప్పనిసరిగా అక్కడ ఉండేలా చూసుకుంటారు. కానీ.... అధికారులు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారు మంత్రులను 'లైట్‌'గా తీసుకుంటున్న ఉదంతాలు వరుసగా బయటపడుతున్నాయి. ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపే సమయంలో మంత్రులను అధికారులు విస్మరిస్తున్నారు. కార్యక్రమం తమ శాఖకు సంబంధించినదైనా... ఆహ్వానం అసలే రాకపోవడం, వచ్చినా తగిన మర్యాదలు పాటించకపోవడంతో మంత్రులు 'వెళ్లాలా వద్దా' అనే డోలాయమానంలో పడుతున్నారు.

తపాల్ ద్వారా డిప్యూటీ సీఎం చినరాజప్పకు ఆహ్వానం

తపాల్ ద్వారా డిప్యూటీ సీఎం చినరాజప్పకు ఆహ్వానం

హోం శాఖను కూడా చూస్తున్న డిప్యూటీ సీఎం చిన రాజప్పకు ఎదురైన అనుభవం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. రెండు రోజుల క్రితం రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం హోం శాఖ పరిధిలోకి వస్తుంది. కానీ, కార్యక్రమ నిర్వాహకులు హోం మంత్రి చిన రాజప్పను విస్మరించారు. సాధారణంగా దానికి సంబంధించిన అధికారులు స్వయంగా మంత్రిని కలిసి ఆహ్వానం అందించి, కార్యక్రమానికి రావాలని కోరాలి. కానీ... ఎఫ్‌ఎ్‌సఎల్‌ భూమిపూజ ఆహ్వాన పత్రాన్ని సచివాలయంలోని చినరాజప్ప కార్యాలయానికి ‘తపాల్‌' ద్వారా పంపారు. ఆ తర్వాతైనా కనీసం ఫోన్‌ చేసి ఎవరూ ఆహ్వానించలేదు. దీంతో డిప్యూటీ సీఎంకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆయన అదే రోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లిపోయారు. ఈ విషయం ప్రసార సాధనాల్లో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సలహాదారు గాంధీ హోంమంత్రికి ఫోన్‌ చేసి క్షమాపణ చెప్పారు.

 ఆహ్వానంతో పని లేదన్న డిప్యూటీ సీఎం చినరాజప్ప

ఆహ్వానంతో పని లేదన్న డిప్యూటీ సీఎం చినరాజప్ప

ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి ఆహ్వానం అందనందుకు అలిగారని మీడియాలో ప్రచారం కావడంతో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప నోరు విప్పారు. తాను ఆహ్వానం కోసం చూసే వ్యక్తిని కాదని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే పిలిచినా పిలవకపోయినా వస్తానని చెప్పారు. తిరుమల పర్యటన ముందే నిర్ణయించుకున్నందునే అక్కడికి వెళ్లానని తెలిపారు. ఇలాంటి అనుభవమే మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కొద్ది రోజుల క్రితం ఎదురైంది. ‘విట్‌' విద్యా సంస్థ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల అమరావతిలో జరిగింది. ఉప రాష్ట్రపతి ముప్పవరుపు వెంకయ్య నాయుడు దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా శాఖను చూస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఆహ్వాన పత్రంలో ముద్రించినా... ఆయనకు వర్తమానమేదీ లేదు. ఎవ్వరూ కలిసి పిలవలేదు. దీంతో ఏం చేయాలో తెలియక మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

 పర్యాటకశాఖ కార్యక్రమాలకు ఆహ్వానం లేని అఖిలప్రియ

పర్యాటకశాఖ కార్యక్రమాలకు ఆహ్వానం లేని అఖిలప్రియ

దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకూ ఇదే పరిస్థితి ఎదురైంది. విజయవాడలోని కనక దుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. భక్తులు లక్షలాదిగా వస్తారు. దాని ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన సమావేశానికి దేవాదాయ మంత్రి మాణిక్యాలరావును ఆహ్వానించడం అనవాయితీ. కానీ, ఈ ఏడాది పిలవలేదు. ఆ తర్వాత ఉత్సవాల ప్రారంభోత్సవానికి మాత్రం పిలిచారు. ‘ఏర్పాట్ల సమయంలో నేను గుర్తుకు రాలేదా?' అని అధికారులపై మంత్రి చురక విసిరారు. దీనికి సమాధానం చెప్పలేక అధికారులు మౌనం వహించారు. పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు కూడా ఒకటి రెండు సందర్భాల్లో తమ శాఖ కార్యక్రమాలకు ఆహ్వానం సరైన రీతిలో అందలేదు. మంత్రులుగా ఉన్న తమ పట్లే అధికారులు ఇలా ప్రవర్తిస్తే మిగిలిన వారి విషయంలో ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కొందరు అధికారుల ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. మేం వారి కంటికి కనిపిస్తున్నామో లేదో తెలియడంలేదు'' అని మరో మంత్రి వాపోయారు.

 మరోసారి అప్రమత్తం చేస్తామన్న సీఎంఓ

మరోసారి అప్రమత్తం చేస్తామన్న సీఎంఓ

అధికారుల తప్పిదాల వల్ల చిన్నచిన్న అంశాలు కూడా పెద్దవి అవుతున్నాయని, మంత్రుల విషయంలో ప్రొటోకాల్‌ పాటించాలని పదేపదే చెబుతున్నా కొందరు అధికారులు అర్థం చేసుకోవడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు చెప్పారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో పాటించాల్సిన పద్ధతులు ఉంటాయి. వీటి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల సమస్యలు వస్తున్నాయి. దీనిపై మరోసారి అందరినీ అప్రమత్తం చేస్తాం'' అని ఆ అధికారి తెలిపారు.

 చినరాజప్పను వెంటబెట్టుకుని మరి..

చినరాజప్పను వెంటబెట్టుకుని మరి..

చిన రాజప్పకు ఆహ్వానం విషయంలో చోటు చేసుకొన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. శుక్రవారం విజయవాడ లో ప్రకాశం బ్యారేజీ 60వ వార్షికోత్సవం జరిగింది. దీనికి రాజప్ప హాజరయ్యారు. తనకు ఆహ్వానం లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నారని తెలిసి ఆయన వచ్చారు. ఆయనను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దగ్గరకు పిలిచి తన వెంట తీసుకొని వెళ్లారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh officials didn't care Ministers. So many occassions they didn't send invitations concerned Ministers. It is leads unnecessary contraversies. Recently no invitation for Home Minister and Deputy CM China Rajappa for inaguration of Forensic Laboratory.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి