మహిళలకు మరో అదిరిపోయే వార్త.. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మరో ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలపరచాలనే లక్ష్యంతో 'మహిళా శక్తి సూపర్ బజార్లు'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మహిళా సూపర్ బజార్లు

ఈ ప్రాజెక్ట్ డీమార్ట్ లాంటి ఆధునిక రిటైల్ మోడల్‌ను అనుసరించి నడపబడుతుంది. తొలి దశలో రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ సూపర్ బజార్లు స్థాపించనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ బజార్లు ఏర్పాటవుతాయి. ఈ బజార్లలో నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, వివిధ రకాల ఉత్పత్తులు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.

MahilaShakti Super Bazars with shg women in 9 unified districts following DMart model in telangana

ప్రభుత్వ భూములను సేకరించి నిర్మాణాలు

ఈ సూపర్ బజార్ల ద్వారా సాధారణ ప్రజలకు మేలు చేయడంతోపాటు మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్యా దేవరాజన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకోబడ్డాయి. సూపర్ బజార్ల నిర్మాణానికి సుమారు 5,000గజాల స్థలం అవసరమని అంచనా వేశారు. జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను సేకరించి, త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ఖమ్మంలో సూపర్ బజార్ తో పాటు లాజిస్టిక్స్ హబ్ , రైస్ మిల్లు

ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ ప్రాజెక్ట్ మరింత విస్తృతంగా అమలు చేయనున్నారు. ఇక్కడ లాజిస్టిక్స్ హబ్ మరియు ఆధునిక రైస్ మిల్లును కూడా స్థాపించాలని ప్రతిపాదించారు. దీనికి సుమారు 20 ఎకరాల భూమి కేటాయించటానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం ఇవ్వడం గమనార్హం. ఈ సౌకర్యాల నిర్వహణ బాధ్యతలను స్థానిక మహిళా సమాఖ్యలకు అప్పగించి, వారిని నిజమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు సదవకాశం

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మహిళలు స్వయం సమృద్ధి సాధించడం జరుగుతుంది. సూపర్ బజార్లు, లాజిస్టిక్స్ హబ్‌లు, రైస్ మిల్లుల వంటి యూనిట్ల ద్వారా ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలలో మహిళలు పట్టు సాధిస్తే ఆదాయం సంపాదించవచ్చు. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంతోపాటు, సమాజంలో వారి స్థానాన్ని బలపరుస్తుంది.

ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులు.. ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులు.. ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్

రాష్ట్రవ్యాప్తంగా ఈ మోడల్ విస్తరించే ఆలోచన

భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ మోడల్‌ను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహిళా సమాఖ్యలను ఆర్థికంగా, నిర్వహణాపరంగా బలపరచడం ద్వారా తెలంగాణలో స్త్రీ సాధికారతకు కొత్త అధ్యాయం మొదలవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే, దేశంలోనే మహిళా సాధికారతకు తెలంగాణా రాష్ట్రం ఒక మంచి మార్గదర్శకంగా నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+