కోట్ల రూపాయలు నష్టపోనున్న ఆహార బ్రాండ్లు..! కేంద్రం ఒక్క నిర్ణయంతో..!

మనం నిత్యం మార్కెట్లో చూసే, కొనుగోలు చేసే ఆహార ఉత్పత్తుల బ్రాండ్లు (Brands) జూలై నుంచి కోట్ల నష్టాలు చవిచూస్తున్నాయి. దీనికి ధరలు పడిపోవడమో, ముడి సరుకుల రేట్లు పెరగడమో, పశ్చిమాసియా సంక్షోభమూ కారణం కాదు. కేవలం కేంద్రం తీసుకున్న ఒకే ఒక నిర్ణయం. అదే లేబుల్స్, ప్యాకేజింగ్, ప్రచార సామగ్రిపై "100%", "100% స్వచ్ఛమైనది" ఇలాంటి పదాలు ఉపయోగించకుండా ఆహార కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విధించిన నిషేధం.

మైక్రోవేవ్ ఓవెన్ల ఆహారం వినియోగిస్తున్నారా..?
మైక్రోవేవ్ ఓవెన్ల ఆహారం వినియోగిస్తున్నారా..?

వినియోగదారుల్ని తప్పుదారి పట్టించే మార్కెటింగ్‌ను నివారించడం, వినియోగదారులకు పారదర్శకతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఆహార వ్యాపారాలకు, ఇది కేవలం ప్యాక్‌ను మార్చడం చేయడం మాత్రమే కాదు ఇందులో చాలా ప్రక్రియ ఉంటుంది. వినియోగదారులకు ఈ మార్పు పైపైన కనిపించేదిగా ఉండవచ్చు. కానీ కంపెనీలకు, ఇది అస్సలు పైపైన కనిపించేది కాదు. లేబుల్ మార్పు అనేది బయటకు చూస్తే చాలా సులభంగా అనిపించినా.. కేవలం ప్యాకేజింగ్‌ను అప్‌డేట్ చేసి ముందుకు సాగిపోవడమే. కానీ వాస్తవానికి, ఇది వ్యాపారం అంతటా కార్యాచరణ, నియంత్రణ , ఆర్థికపరమైన పరిణామాలకు కారణమవుతుంది.

Brands Face Crore Losses as 100 Labelling Ban Takes Effect in July
ఇరాన్ వార్ నేర్పిన పాఠం..! మంగళూరులో కేంద్రం 15 వేల కోట్ల ప్రాజెక్ట్..!
ఇరాన్ వార్ నేర్పిన పాఠం..! మంగళూరులో కేంద్రం 15 వేల కోట్ల ప్రాజెక్ట్..!

FSSAI నిర్ణయం వల్ల ఇప్పుడు 100 శాతం అని ముద్రించిన ప్రతీ ఉత్పత్తీ తమ ప్యాకింగ్ మార్చాలి. ఇలా మార్చేందుకు కొన్ని వందల కోట్లు వ్యయం తప్పదు. అంతకంటే ఎక్కువ తమ విధానాల్లో మార్పులు చేయడం, ప్రింటింగ్ డిజైన్లు మార్చడం ఇలా చాలా ప్రక్రియలు ఇందులో ఇమిడి ఉంటాయి. అంటే సవరించిన ఒక్క ఉత్పత్తి వినియోగదారులను చేరేలోపే వారి బిల్లు త్వరగా కోట్లలోకి చేరవచ్చు. ఆహార కంపెనీలు తరచుగా నెలల తరబడి ముందుగా ముద్రించిన ప్యాకేజింగ్ నిల్వను కలిగి ఉంటాయి. తయారైన ఉత్పత్తులు అప్పటికే పంపిణీదారులు, రిటైలర్లు, క్విక్-కామర్స్ గిడ్డంగుల ద్వారా రవాణా అవుతుంటాయి. నిబంధనల గడువుకు ముందే పాత స్టాక్‌ను అమ్మడం, తిరిగి పంపడం లేదా పారవేయడం చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ మార్చుకుంటూ పోతే ఆయా ఆహార ఉత్పత్తుల కంపెనీలకు కోట్ల నష్టాలు తప్పవని అర్దమవుతోంది. కానీ ఇదంతా తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+