Vijay: తమిళనాడు సీఎంగా 50 రోజులు.. విజయ్ బొమ్మ హిట్టా..? ఫట్టా..?

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సినీ నటుడు సి. జోసెఫ్ విజయ్ తన తొలి నెల పాలనను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇవాళ జూన్ 22 న ఆయన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇవాళ్టితో ఆయన తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 45 రోజులు కావస్తుంది. మే 10న రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టారు. మరో నాలుగు రోజుల్లో ఆయన ఆయన పదవి చేపట్టి 50 రోజులు పూర్తవుతున్న తరుణంలో.. ఈ స్వల్ప కాలంలోనే విజయ్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యమంత్రిగా విజయ్ శైలి గత రాజకీయ నేతలకు భిన్నంగా కనిపిస్తోంది. సాంప్రదాయ శైలికి భిన్నంగా బ్లాక్ సూట్, వైట్ షర్ట్ ధరించి సచివాలయానికి నిర్ణీత సమయానికి చేరుకోవడం విశేషం. ప్రతిరోజూ ఏడు గంటల పాటు విధుల్లో గడుపుతూ పాలనా యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 'వెట్రి తమిళగం విజన్ డాక్యుమెంట్' పేరిట 436 అంశాలతో కూడిన పరిపాలనా బ్లూప్రింట్‌ను కూడా ఆయన కేబినెట్ సిద్ధం చేసింది.

కీలక నిర్ణయాలు, సంక్షేమ పథకాలు

విజయ్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో వేగం పెంచింది. పూజా స్థలాలు, విద్యా సంస్థలకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను (టాస్మాక్) రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారిణి కె. భవానీశ్వరి నేతృత్వంలో 'సింగపెణ్ణె' ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ను అధికారికంగా ప్రారంభించింది.

పేద ప్రజలకు తక్కువ ధరకే ఆహారాన్ని అందించే 620 'అమ్మ ఉణవగం' క్యాంటీన్ల ఆధునీకరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో అవినీతి నిర్మూలనకు సింగిల్ విండో విధానం తీసుకురావడంతో పాటు, మౌలిక వసతుల కాంట్రాక్టులలో లంచాల వ్యవస్థకు స్వస్తి పలికేలా కఠిన మార్గదర్శకాలను జారీ చేయడం విజయ్ పాలనలో ప్రధానంగా చెప్పుకోవచ్చు.

సవాళ్లు, విమర్శలు

పరిపాలనలో వేగం ప్రదర్శిస్తున్నప్పటికీ విజయ్ ప్రభుత్వానికి తొలి నెలలోనే కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. జ్యోతిష్యుడిని ప్రత్యేక అధికారిగా నియమించడం తీవ్ర వివాదానికి దారితీయడంతో 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అలాగే కాంచీపురంలో వాటర్ ట్యాంక్ టెండర్ వ్యవహారంలో వచ్చిన ఆరోపణల వల్ల ఆ ప్రక్రియను నిలిపివేయడం ప్రభుత్వ ముందస్తు నిఘా లోపాన్ని ఎత్తిచూపింది. ఈ పరిణామాలపై ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్ర విమర్శలు గుప్పించింది.

CMVijay First 50 Days in Tamil Nadu Key Decisions Challenges Spark Major Political Debate CMVijay

జూన్ 1న తిరుచ్చిలో జరిగిన ధన్యవాదాల సభ విజయ్ రాజకీయ బలాన్ని నిరూపించినప్పటికీ, కే వలం రాజకీయ ప్రసంగాలకే పరిమితమయ్యారనే విమర్శలు వచ్చాయి. ఏదేమైనా, సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, తన తొలి 50 రోజుల పాలనలో సంస్కరణల దిశగా స్పష్టమైన అడుగులు వేశారు. అయితే ద్రవిడ రాజకీయాల అస్త్రాలను ఎదుర్కొని నిలబడటంలో ఆయన భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+